SNP
Hardik Pandya, BCCI, Gautam Gambhir: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. అది గంభీర్ మార్క్ డిసిషన్ అంటూ వార్తలు వస్తున్నాయి. దాని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Hardik Pandya, BCCI, Gautam Gambhir: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. అది గంభీర్ మార్క్ డిసిషన్ అంటూ వార్తలు వస్తున్నాయి. దాని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియా హెడ్ కోచ్‌గా ఫీల్డ్‌లోకి దిగకముందే గౌతమ్ గంభీర్ చాలా విషయాల్లో టీమిండియాను ప్రక్షాళన చేస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్‌గా రావాలని అతనికి పిలుపొచ్చినప్పుడే బీసీసీఐ గంభీర కొన్ని కండీషన్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. టీ20ల్లో యువ క్రికెటర్లు ఉండాలి, మూడు ఫార్మాట్లకు మూడు వేర్వేరు టీమ్స్ ఉండాలి అలాగే కెప్టెన్సీ మార్పు, ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై బీసీసీఐకి గంభీర్ కొన్ని షరుతుల పెట్టి.. వాటికి అంగీకరించి తనకు సపోర్ట్ చేస్తేనే తాను హెడ్ కోచ్‌గా ఉంటానని చెప్పినట్లు చాలా రోజుల క్రితమే నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. అవన్నీ నిజాలే అనేలా ప్రస్తుతం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
అయితే.. గంభీర్ తీసుకొస్తున్న కొత్త రూల్స్‌తో ముందు హార్ధిక్ పాండ్యా బలి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. టీమిండియాకు ఆడుతున్న ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు ఎక్కువ విరామం దొరికినప్పుడు దేశవాళి క్రికెట్‌లో ఆడాలనే కండీషన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయమై హార్ధిక్ పాండ్యాను బోర్డు సంప్రదించినట్లు సమాచారం. వన్డే క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు దేశవాళి లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ ఆడాలని పాండ్యాకు బీసీసీఐ సూచించినట్లు సమాచారం. వన్డే వరల్డ్ కప్ 2023 మధ్యలో గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్న పాండ్యా మళ్లీ వన్డేలు ఆడలేదు.
ఆగస్టు మొదలి వారంలో శ్రీలంకతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కి ముందు పాండ్యా దేశవాళి క్రికెట్‌లో ఆడితే బాగుంటుందని బీసీసీఐ ఈ సూచన చేసినట్లు తెలుస్తోంది. అయితే.. తరచు గాయాల పాలయ్యే పాండ్యాపై ఇలాంటి ఒత్తిడి పెట్టడం కరెక్ట్ కాదేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే టీ20 కెప్టెన్సీ విషయంలోనూ పాండ్యాకు గంభీర్ ఊహించని షాక్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను నియమించాలని గంభీర్.. బీసీసీఐ సూచించినట్లు తెలుస్తోంది. మరి ఒక వైపు కెప్టెన్సీ దక్కకా, మరోవైపు వన్డేల కోసం తన ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి పాండ్యా దేశవాళి క్రికెట్ ఆడాల్సి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.