IND vs SL: శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు!

IND vs SL: శ్రీలంకతో రెండో వన్డేలో టీమిండియా ఓటమికి 3 ప్రధాన కారణాలు!

IND vs SL, Rohit Sharma, Virat Kohli: శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs SL, Rohit Sharma, Virat Kohli: శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొలంబో వేదకగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. శ్రీలంకపై భారత్‌ ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు. లంక టీమ్‌లోని ముగ్గురు ప్రధాన బౌలర్లు లేకపోయినా.. లంక ఇండియాను ఓడించింది. కేవలం 241 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక ఓటమిపాలైంది రోహిత్‌ సేన. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక బ్యాటర్లలో ఒక్కరు కూడా హాఫ్‌ సెంచరీ చేయలేదు.. కానీ, చాలా మంది మినిమమ్‌ రన్స్‌ చేసి.. తన వంత పాత్ర పోషించారు. కానీ, భారత జట్టులో రోహిత్‌ శర్మ, అక్షర్‌ పటేల్‌ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. అసలు శ్రీలంకపై టీమిండియా ఓటమికి మూడు ప్రధాన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. చెత్త బ్యాటింగ్‌
అరివీర భయంకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న టీమిండియా.. 241 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేకపోయింది. అది కూడా ఒక పసికూన జట్టుపై. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఒక్కడే 44 బంతుల్లో 64 పరుగులు చేసి రాణించాడు. తొలి వన్డేలో కూడా రోహిత్‌ ఒక్కడే హాఫ్‌ సెంచరీ చేశాడు. కానీ, మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం అవుతున్నారు. రోహిత్‌ కాకుండా మిగతా వారిలో అక్షర్‌ పటేల్‌ ఒకడు కాస్త పర్వాలేదు. వైస్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, శివమ్‌ దూబే, శ్రేయస్‌ అయ్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌.. ఇలా అంత దారుణంగా విఫలం అయ్యారు. రెండో మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్‌ వైఫల్యమే.

2. స్లో పిచ్‌, టాస్‌
ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడిపోవడం కూడా టీమిండియా ఓటమిపై ప్రభావం చూపింది. పరిస్థితుల దృష్ట్యా.. ముందుగా బ్యాటింగ్‌ చేస్తేనే ఈ పిచ్‌పై విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. లంక కెప్టెన్‌ అసలంకా టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసి.. టీమిండియా ముందు తొలి వన్డే కంటే పది పరుగులు ఎక్కువే చేసి టార్గెట్‌గా పెట్టాడు. 241 టార్గెట్‌లో బరిలోకి దిగిన టీమిండియా రోహిత్‌-గిల్‌ మంచి స్టార్ట్‌ ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్‌ శర్మ.. సూపర్‌ బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. తొలి వికెట్‌కు 97 పరుగుల భారీ స్కోర్‌ జోడించి అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే గిల్‌ కూడా అవుట్‌ అయ్యాడు. స్లో పిచ్‌పై భారత ‍బ్యాటర్లు తేలిపోయారు. లంక స్పిన్నర్లకు, పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కొలేకపోయారు. స్లో పిచ్‌పై బ్యాటింగ్‌ చేయలేకపోవడం టీమిండియా ఓటమికి ఒక కారణం.

3. టీ20 మూడ్‌
ప్రస్తుతం జట్టును పట్టి పీడుస్తున్న భూతం ఏంటంటే.. టీ20 మూడ్‌. ఇటీవలె టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడం, జింబాబ్వేపై 5 టీ20ల సిరీస్‌, శ్రీలంక 3 టీ20ల సిరీస్‌తో టీమిండియా ప్లేయర్లు.. టీ20 మూడ్‌లోనే ఉన్నారు. ఇంకా వన్డేలకు అలవాటు పడినట్లు కనిపించడం లేదు. రోహిత్‌ శర్మ టీ20 స్టైల్‌లోనే బ్యాటింగ్‌ చేస్తూ.. స్టార్టింగ్‌లో రన్స్‌ చేస్తున్నాడు. కానీ, తనకు వచ్చిన మంచి స్టార్ట్‌ను పెద్ద స్కోర్‌గా మల్చలేకపోతున్నాడు. ఇక మిగతా బ్యాటర్లు కాస్త ఓపికతో ఆడి.. క్రీజ్‌లో కుదురుకోలేకపోతున్నారు. ఇదంతా.. టీ20 మూడ్‌ నుంచి బయటపడి.. వన్డేను వన్డేలా ఆడకపోవడం వల్లే ఓటమి ఎదురైందని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి టీమిండియా ఓటమికి కారణమైన ఈ 3 అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments