మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కుభేర’ మూవీ రివ్యూ

Kubera Movie Review In Telugu: ధనుష్ , నాగార్జున , రష్మిక మందన ప్రధాన పాత్రలలో నటించిన కుభేర సినిమా ఈరోజు థియేటర్ లో విడుదల అయింది. ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేసారన్న మాట వాస్తవం. చాల గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి ఇలాంటి కాన్సెప్ట్ రావడంతో మొదటినుంచి అందరికి సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ కలిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలు రివ్యూలో చూసేద్దాం.

Kubera Movie Review In Telugu: ధనుష్ , నాగార్జున , రష్మిక మందన ప్రధాన పాత్రలలో నటించిన కుభేర సినిమా ఈరోజు థియేటర్ లో విడుదల అయింది. ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేసారన్న మాట వాస్తవం. చాల గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి ఇలాంటి కాన్సెప్ట్ రావడంతో మొదటినుంచి అందరికి సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ కలిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలు రివ్యూలో చూసేద్దాం.

కుభేర

, సోషల్ డ్రామా ,
  • నటినటులు: నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్, దలీప్ తాహిల్, కల్నల్ రవి శర్మ, సునయన తదితరులు
  • దర్శకత్వం:శేఖర్ కమ్ముల
  • నిర్మాత:సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు
  • సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
  • సినిమాటోగ్రఫీ:నికేత్ బొమ్మిరెడ్డి

Rating

3

ధనుష్ , నాగార్జున , రష్మిక మందన ప్రధాన పాత్రలలో నటించిన కుభేర సినిమా ఈరోజు థియేటర్ లో విడుదల అయింది. ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేసారన్న మాట వాస్తవం. చాల గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి ఇలాంటి కాన్సెప్ట్ రావడంతో మొదటినుంచి అందరికి సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ కలిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాలు రివ్యూలో చూసేద్దాం.

కథ :

దీపక్ (నాగార్జున) నిజాయితీగల ఒక సీబీఐ ఆఫీసర్ . అతను ఏ తప్పు చేయకపోయినా కొంతమంది పెట్టిన తప్పుడు కేసులతో జైలులో ఉంటాడు. మరోవైపు నీరజ్ మిత్ర (జిమ్ సర్బ్) ఓ పెద్ద పారిశ్రామిక వేత్త. అతను ఓ ఆయిల్ రిగ్ ను ప్రభుత్వం నుంచి దక్కించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. దానికోసం కొన్ని లక్షల కోట్లు లంచం ఇవ్వాల్సి వస్తుంది. అందుకు తప్పుడు కేసులో జైల్లో ఉన్న సీబీఐ ఆఫీసర్ దీపక్ ను బయకు తీసుకుని వస్తాడు. బయటకు వచ్చిన దీపక్ ఆ ప్లాన్ లో భాగంగా నలుగురు బిచ్చగాళ్లను తీసుకొచ్చి వారి పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత ముగ్గురు బిచ్చగాళ్లను చంపేస్తారు. కానీ నాలుగోవాడైన దేవా (ధనుష్) మాత్రం అనుకోకుండా మిస్ అవుతాడు. దేవా కావాలనే తప్పించుకున్నాడా? దీపక్ కు దేవాకు ఉన్న సంబంధం ఏంటి ? దీపక్ టీం దేవాను పట్టుకున్నారా లేదా ? ఈ మొత్తం కథలో రష్మిక పాత్ర ఏమైఉంటుంది ? అసలు దేవా ఆ డబ్బుతో ఎక్కడికి పారిపోతాడు ? చివరికి ఏమి జరిగింది అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

నటీనటుల పని తీరు :

ఒరిజినల్ గా ఇది ధనుష్ సినిమానే అయినా అంతే ఈక్వల్ గా నాగార్జున రోల్ ను చూపించడం సినిమాకు హైలెట్ అయింది. ఇక ధనుష్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇక నాగార్జున పాత్ర విషయానికొస్తే నెగెటివ్ , పాజిటివ్ షేడ్స్ ను ఎంతో అద్భుతంగా కనబరిచారు. చాలా ఏళ్ళ తర్వాత నాగార్జున కు కరెక్ట్ క్యారెక్టర్ పడిందని ప్రేక్షకుల అభిప్రాయం. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో నాగార్జున కళ్ళతో నటించిన తీరు అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ఇద్దరికిద్దరు పోటాపోటీగా నటించి కథను ముందుకు నడిపించేస్తారు. ఇక రష్మిక కూడా ఈ మూవీలో చాలా డీసెంట్ గా తన పాత్రకు తగిన న్యాయం చేసింది. ఇక మిగిలిన నటులంతా తమ స్థాయి మేర నటించి అలరించారు.

టెక్నీకల్ విభాగం పనితీరు :

టెక్నీకల్ విభాగం విషయానికొస్తే.. సినిమాలో సినిమాటోగ్రాఫర్‌ నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ మూవీకి బిగ్ అసెట్. ఇక దేవిశ్రీ అందించిన మ్యూజిక్ , సాంగ్స్ అయితే అద్భుతంగా కథలో ఇమిడిపోయాయి. ఎడిటింగ్ వర్క్స్ కూడా మంచి మార్క్స్ వేయొచ్చు. కాస్త గ్యాప్ తీసుకున్నా కూడా శేఖర్ కమ్ముల రచయితగా , దర్శకుడిగా సినిమాకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. స్క్రీన్ ప్లే అద్భుతంగ ఉందని టాక్. కానీ కొన్ని చోట్ల ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటె బావుండేదని అనిపిస్తుంది. సినిమా రన్ టైం విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటె బావుండేదని ఫీలింగ్ కలుగుతుంది.

విశ్లేషణ:

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఎప్పుడు సాఫ్ట్ లవ్ స్టోరీస్ తీసే శేఖర్ కమ్ముల నుంచి ఓ సోషల్ క్రైమ్ డ్రామా రావడం. రెండు నాగార్జున , ధనుష్ కాంబినేషన్. మూడు సినిమా ప్లాట్ అంతా ధనికుడికి, బిచ్చగాడికి మధ్య ఉండడం. ప్రపంచంలో మనిషిని గెలిపించేది , ఓడించించేది , ఆడించేది డబ్బు మాత్రమే. సో సహజంగానే ఇలాంటి కాన్సెప్ట్స్ మీద అందరికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ విషయంలోనే శేఖర్ కమ్ముల సగం సక్సెస్ అయ్యాడు. ఇక తెరమీద బొమ్మ పడిన తర్వాత ఈ క్రైమ్ డ్రామా విత్ సోషల్ మెసేజ్ ఎలిమెంట్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. ఏ విషయంలోనూ లోతుకు వెళ్లకుండా పైపైన డిస్కస్ చేస్తూనే సినిమా మొత్తం నడిపించేసాడు దర్శకుడు.

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ క్యారెక్టర్స్ ను పరిచయం చేయడం. వాళ్ళ మధ్య జరిగే టిపికల్ సిట్యువేషన్స్ ను ఎస్టాబ్లిష్ చేయడం .. వారి ప్రయాణం తర్వాత ఎలాంటి మలుపు తిరుగుతుంది అని ఆసక్తికరంగా సాగిపోతూ ఉంటుంది. ఇక సెకండ్ ఆఫ్ లో అసలు కథ , ట్విస్ట్ లు టర్న్ లు ఉంటూ చివరివరకు ఎంగేజింగ్ గా ఉంచుతుంది. కాకపోతే సినిమా రన్ టైం కాస్త తగ్గిస్తే బావుండేదేమో అనే ఫీలింగ్ వస్తుంది. బిచ్చగాళ్ళ కష్టాలు, కార్పొరేట్ హావ , మనీ హవాలా మాఫియా ఇలా రకరకాల లేయర్స్ ను లైటర్ వే లో చూపించి కథను నడిపించేసాడు. ఫైనల్ గా శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఓ సెన్సిటివ్ టాపిక్ ను లైటర్ వే లో తెరమీద చూపించి సక్సెస్ అయ్యాడు.

ప్లస్ లు :

  • కథ, కథనం
  • నాగార్జున , ధనుష్
  • పాటలు

మైనస్ లు :

  • రన్ టైం
  • క్లైమాక్స్ (కొంచెం హడావిడిగా అనిపించడం)

రేటింగ్ :3/5

చివరిగా : ‘కుభేర’  ఎంగేజింగ్ ఫీల్ గుడ్ సోషల్ మెసేజ్ డ్రామా

(ఈ రివ్యూ సమీక్షకుని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments