Swetha
కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఓటీటీ లోకి రాడానికి చాలా సమయం తీసుకుంటాయి. ఈ లిస్ట్ లోకి బిజుమీనన్ , ఆసిఫ్ అలీ నటించిన తలవన్ మూవీ కూడా యాడ్ అయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది.
కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఓటీటీ లోకి రాడానికి చాలా సమయం తీసుకుంటాయి. ఈ లిస్ట్ లోకి బిజుమీనన్ , ఆసిఫ్ అలీ నటించిన తలవన్ మూవీ కూడా యాడ్ అయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది.
Swetha
ఇప్పుడు దాదాపు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా నెల రోజుల లోపే ఓటీటీ లో ఎంట్రీ ఇస్తున్నాయి. లేదంటే ఆ సినిమా థియేట్రికల్ రన్ ను బట్టి.. కొద్దీ రోజులు అటు ఇటుగా ఓటీటీ లో ఎంట్రీ ఇస్తాయి. కానీ కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం ఓటీటీ లోకి రాడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు బిజు మీనన్ , ఆసిఫ్ అలీ హీరోలుగా నటించిన మలయాళ మూవీ.. విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి నెల రోజులు గడిచినా కానీ ఇప్పటివరకు ఓటీటీ డిస్కషన్ జరగలేదు. దీనితో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇన్ని రోజులు తర్వాత ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటో ఎప్పుడు ఓటీటీ లోకి రానుంది అనే విషయాలు చూసేద్దాం.
బిజు మీనన్ , ఆసిఫ్ అలీ హీరోలుగా నటించిన రీసెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ “తలవన్”. ఈ మూవీ మే నెలలో థియేటర్ లో రిలీజ్ అయింది. దాదాపు 10కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. ఇక థియేటర్ లో రిలీజ్ అయినా తరువాత ఊహించని రేంజ్ లో ఈ మూవీ 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీనితో ఈ మూవీని థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దాదాపు ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తైన కానీ .. ఇంకా ఓటీటీ లోకి మాత్రం రాలేదు. అయితే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన అప్ డేట్ అయితే వచ్చింది కానీ స్ట్రీమింగ్ కు మాత్రం ఆలస్యంగానే వస్తుంది. తలవన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను.. సోని లివ్ సొంతం చేసుకుంది. ఇక సెప్టెంబర్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. కాబట్టి ఈ మూవీని ఓటీటీ లో చూడాలంటే ఇంకొన్ని నెలలు వేచి చూడాల్సిందే.
ఇక తలవన్ మూవీ స్టోరీ విషయానికొస్తే.. ఆసిఫ్ అలీ.. ట్రాన్స్ఫర్ పైన బిజు మీనన్ పని చేస్తున్న పోలీస్ స్టేషన్ కు వస్తాడు. అయితే అతని దూకుడు తనం బిజు మీనన్ కు నచ్చదు. ఈ క్రమంలో ఓ రోజు ఓ కేసులో అరెస్ట్ అయినా మనుదాస్ అనే అతనిని.. బిజు మీనన్ అనుమతి లేకుండా ఆసిఫ్ విడుదల చేస్తాడు. దీనితో ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. దీనితో బిజు పైన ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూస్తుంటారు అసిఫ్. అయితే, వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిన కొన్నాళ్ల తర్వాత.. బిజు మీనన్ ఇంటి పైన అనుమానాస్పద రీతిలో రమ్య అనే యువతి డెడ్ బాడీ దొరుకుతుంది. దీనితో రమ్యకు బిజు మీనన్ కు ఎదో సంబంధం ఉందని.. పుకార్లు మొదలవ్వడంతో.. అతనే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు కూడా అతనినే అనుమానించి అరెస్ట్ చేస్తారు. అసలు రమ్య ఎలా చనిపోయింది ? నిజంగానే వాళ్ళిద్దరికీ ఏదైనా సంబంధం ఉందా ? ఈ కేసు నుంచి బిజు మీనన్ ఎలా బయటపడ్డాడు ? ఈ కేసును ఆసిఫ్ చేపట్టడానికి కారణం ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ మూవీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.