Swetha
ఓటీటీ లోకి రెగ్యులర్ సినిమాలు కాకుండా ఓ డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రాబోతుంది. థియేటర్ లో సూపర్ హిట్ సాధించిన ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఓటీటీ లోకి రెగ్యులర్ సినిమాలు కాకుండా ఓ డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రాబోతుంది. థియేటర్ లో సూపర్ హిట్ సాధించిన ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
Swetha
థియేటర్ లో సినిమాలు ఏ టాక్ సంపాదించుకున్నా కానీ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత మాత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంటాయి. పైగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో రెగ్యులర్ సస్పెన్స్ , రొమాన్స్ థ్రిల్లర్స్ తో పాటు.. బయోపిక్ మూవీస్ కు ఓ స్పెషల్ ప్లేస్ ఉంది. ఇప్పటివరకు ఓటీటీ లో ఎందరో నిజ జీవితాలను ఆధారంగా తీసుకుని రూపొందించిన సినిమాలను, సిరీస్ లను చూసి ఉంటారు. పైగా ఈ సినిమాల ద్వారా ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉండి ఉంటారు. ఈ క్రమంలోనే త్వరలో ఓటీటీ లోకి ఓ డిఫ్ఫరెంట్ కాన్సెప్ట్ మూవీ రాబోతుంది. ఇప్పటివరకు వచ్చిన బయోపిక్ సినిమాలను లైట్ తీసుకున్నా కూడా ఈ సినిమాను అసలు మిస్ కాకుండా చూడాలి. ముఖ్యంగా యువత ఈ సినిమాను ఖచ్చితంగా చూడాలి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
ఈ సినిమా పేరు ” స్వాతంత్య్ర వీర్ సావర్కర్”. స్వాతంత్ర పోరాట సమరంలో వివాదస్పద వ్యక్తిగా నిలిచిన ఓ ఫ్రీడమ్ ఫైటర్ వినాయక్ దామోదర్ జీవితానికి ఆధారంగా తెరకెక్కిన సినిమానే ఈ కథ. ఈ సినిమా భారీ అంచనాల మధ్యన మార్చి 22 న థియేటర్ లో రిలీజ్ అయింది. అయితే థియేటర్ లో బయోపిక్స్ ట్రెండ్ పాతపడిందో ఏమో కానీ.. కలెక్షన్స్ పరంగా అంతగా రాబట్టలేకపోయింది. ఇక ఈ సినిమాలో దామోదర్ క్యారెక్టర్ కు ప్రాణం పోసినట్లుగా నటించాడు రణదీప్ హుడా. కేవలం ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించడమే కాకుండా.. అటు సహా నిర్మాతగా, డైరెక్టర్ గా కూడా వ్యవహరించాడు. ఇక ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ ఎంట్రీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఎందుకంటే ఈ సినిమా చిన్న పిల్లల దగ్గరనుంచి.. పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా. దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. అలాంటి వారిలో ఒకరు వినాయక్ దామోదర్. ఇతని జీవిత చరిత్ర ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వచ్చేశాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5 సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ను కూడా.. మే 28 న వినాయక్ దామోదర్ 141 వ జయంతి సంధర్భంగా స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. కాబట్టి ఇది అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.