రావు రమేష్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ.. OTT స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఇదే

Telugu Movie Maruthi Nagar Subramanyam OTT Partner : కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్నాయి. గత నెలలో థియేటర్స్ లో చిన్న సినిమాలాగే హావ. ఈ క్రమంలో రావు రమేష్ నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాకు కూడా పాజిటివ్ బజ్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కన్ఫర్మ్ అయింది.

Telugu Movie Maruthi Nagar Subramanyam OTT Partner : కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్నాయి. గత నెలలో థియేటర్స్ లో చిన్న సినిమాలాగే హావ. ఈ క్రమంలో రావు రమేష్ నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమాకు కూడా పాజిటివ్ బజ్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కన్ఫర్మ్ అయింది.

ఓటీటీ లోకి చిన్న సినిమాలు వచ్చినా , పెద్ద సినిమాలు వచ్చినా కానీ.. కంటెంట్ బావుంటే.. ఇట్టే వ్యూస్ సంపాదించుకుంటాయి. కానీ థియేటర్స్ లో మాత్రం కేవలం పెద్ద సినిమాలకే స్కోప్ ఉంటుందని.. చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే ఇలాంటివన్నీ తుడిచిపెట్టేసేలా.. గత నెలలో ఏకంగా మూడు చిన్న సినిమాలు కంటెంట్ కు ఉన్న సత్తా ఏంటో చూపించాయి. అదే సమయంలో పెద్ద సినిమాలు రిలీజ్ రిలీజ్ అయినా కానీ.. వీటికి మాత్రం ఏ మాత్రం జోష్ తగ్గలేదు. వాటిలో ఒకటి రావు రమేష్ నటించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ను కన్ఫర్మ్ చేసుకుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీ లోకి ఎప్పుడు రానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించి.. ప్రేక్షకులను మెప్పించారు రావు రమేష్. మూవీ లవర్స్ కు ఇతని నటన కొత్తేమి కాదు. కానీ.. రావు రమేష్ మెయిన్ లీడ్ లో నటించడమే ఈ మూవీ స్పెషాలిటీ. ఆగష్టు 23న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా మొదటి షో నుంచి కూడా.. ఓ మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామా గా ప్రశంసలు అందుకుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ.. బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ రాబట్టింది. దీనితో ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు.. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ను కన్ఫర్మ్ చేసుకుంది. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. “మేడం, సర్ త్వరలో ఆహాలో సందడి చేయనున్నారు. గట్టిగా నవ్వేందుకు రెడీగా ఉండండి. సరదాగా ఉండే మారుతీ నగర్ సుబ్రమణ్మం మూవీ త్వరలో ఆహాలోకి రానుంది” అంటూ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు మేకర్స్.

ఇక మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా కథ విషయానికొస్తే.. రావు రమేష్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. దీనితో ఇల్లు గడవడం కోసం అతని భార్య ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అతని కొడుకు అర్జున్ కూడా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటాడు. ఈ క్రమంలో అతను కాంచన అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అలా కష్టాలతో సాగిపోతున్న వారి జీవితంలో.. సడెన్ గా ఓ రోజు.. రావు రమేష్ అకౌంట్ లోకి రూ.10లక్షలు క్రెడిట్ అవుతాయి. వాటి అన్నిటిని కూడా తండ్రి కొడుకులు ఇద్దరు విచ్చల విడిగా ఖర్చు పెట్టేసుకుంటారు. దీనితో వారు చిక్కుల్లో పడతారు. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరు క్రెడిట్ చేశారు ? వారు ఎలాంటి ఇబ్బందులకు గురి అయ్యారు ? ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డరా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments