OTTలోకి థ్రిల్లింగ్ వెబ్ సిరీస్! పాకిస్థాన్ మనపై ఇన్ని కుట్రలు చేస్తుందా?

ఓటీటీలోకి ఇంకొక కొత్త థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఏప్రిల్ 17 న విడుదల చేయగా.. ట్రైలర్ తో పాటు.. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. అది కూడా తెలుగులో ఉండబోతుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

ఓటీటీలోకి ఇంకొక కొత్త థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ రాబోతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఏప్రిల్ 17 న విడుదల చేయగా.. ట్రైలర్ తో పాటు.. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. అది కూడా తెలుగులో ఉండబోతుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

ఓటీటీ లోకి ఎప్పుడు ఏ కొత్త సిరీస్ వస్తుందా ఎప్పుడు ఏ కొత్త సినిమా వస్తుందా అని.. ఓటీటీ ప్రియులు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటున్నారు. ముఖ్యంగా సిరీస్ లు మాత్రం కదలకుండా టైమ్ తెలీకుండా .. అర్ధరాత్రుల వరకు మేలుకుని ఉండి మరి.. కంప్లీట్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పటివరకు మర్డర్ మిస్టరీస్, సర్వైవల్ థ్రిల్లర్స్, హర్రర్ సిరీస్ లకు ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అవుతున్నారో చూస్తూనే ఉన్నాము. తాజాగా మరొక థ్రిల్లింగ్ సిరీస్ రాబోతుంది. పుల్వామా అట్టాక్ గురించి ఆ తర్వాత..  పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మిర్ లోఇండియా చేసిన దాడుల గురించి ఇలాంటి వాటి గురించి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చిన సిరీస్ ఏ “రణ్‌నీతి బాలాకోట్ అండ్ బియాండ్”. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ తో పాటు స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. మరి, ఈ సిరీస్ ఎప్పుడు ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోందని విషయాలను చూసేద్దాం.

“రణ్‌నీతి బాలాకోట్ అండ్ బియాండ్” అనే ఈ సిరీస్ ను సంతోష్ సింగ్ డైరెక్ట్ చేశారు. రణ్‌నీతి వెబ్ సిరీస్ లో లారా దత్తా, జిమ్మి షెర్గిల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే ఇప్పటికే.. పుల్వామా అట్టాక్ మీద, ఎన్నో సినిమాలు, సిరీస్ లు వచ్చాయి కానీ, దాని వెనుక వార్ రూమ్ లో జరిగిన ఘటనలను ఇందులో చూపించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఏప్రిల్ 17 న ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు ట్రైలర్ లోనే.. ఈ వార్ డ్రామా సిరీస్ ఎలా ఉండబోతుందనేది కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక ఈ సిరీస్ ట్రైలర్ తో పాటు.. స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో  సినిమాలో.. ఏప్రిల్ 25 నుంచి.. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

పుల్వామా ఎటాక్ గురించి కొద్దో గొప్పో అందరికి తెలిసే ఉంటుంది. అయితే పుల్వామా ఎటాక్ తర్వాత పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మిర్ లో.. ఇండియా జరిపిన దాడుల వెనుక గల కారణాలేంటి! అసలు అక్కడ ఏం జరిగింది ! ఇండియా అటాక్ తర్వాత.. పాకిస్థాన్ రియాక్షన్ ఏంటి! ఇలా అన్ని అంశాలను కవర్ చేస్తూ ఈ సిరీస్ ద్వారా హిడెన్ రియాలిటీని అందరికి తెలియజేసే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇక సిరీస్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ అయిన.. జియో సినిమా.. “ఈ కథ మీకు తెలుసు. కానీ ఈ యుద్ధం మీకు తెలియదు. ఇండియా చేసిన ఈ చారిత్రక ఆధునిక యుద్ధం గురించి తెలుసుకోండి. రణ్‌నీతి: బాలాకోట్ అండ్ బియాండ్ ట్రైలర్ వచ్చేసింది” అనే క్యాప్షన్ తో .. ఈ సిరీస్ ను ప్రమోట్ చేస్తోంది. ఖచ్చితంగా ఈ సిరీస్ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత అందరికి ఆకట్టుకుంటుందని చెప్పడంలో.. ఏ సందేహం లేదు. మరి “రణ్‌నీతి బాలాకోట్ అండ్ బియాండ్” సిరీస్ అప్ డేట్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments