Gam Gam Ganesha OTT: గం గం గణేశా OTT పార్ట్నర్ లాక్డ్.. స్ట్రీమింగ్ అయ్యేది ఆ OTTలోనే!

ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఎలా ఉన్నాయి అనే టాక్ కంటే కూడా.. ఆయా సినిమాలు ఏ ఓటీటీ లోకి వస్తాయి అనే టాక్ బాగా నడుస్తుంది. ఇప్పుడు ఈరోజే థియేటర్ లో రిలీజ్ అయిన మరో సినిమా గురించి ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది.

ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఎలా ఉన్నాయి అనే టాక్ కంటే కూడా.. ఆయా సినిమాలు ఏ ఓటీటీ లోకి వస్తాయి అనే టాక్ బాగా నడుస్తుంది. ఇప్పుడు ఈరోజే థియేటర్ లో రిలీజ్ అయిన మరో సినిమా గురించి ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది.

గత కొద్దీ రోజులలో థియేటర్ లో సినిమాలు ఏమి లేకపోడంతో అందరూ ఓటీటీ లో ఉన్న సినిమాల గురించి సెర్చ్ చేసేశారు. ఇక ఇప్పుడు థియేటర్ లో సినిమాలు వచ్చినా కానీ ఆయా సినిమాలు ఏ ఓటీటీ లోకి వస్తాయా అనే సెర్చింగ్ లో ఉన్నారు. తాజాగా ఆనంద్ దేవర కొండ నటించిన “గం గం గణేశా” సినిమా.. మే 31 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా కానీ ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డీటెయిల్స్ కూడా అంతే ఫాస్ట్ గా వచ్చేస్తున్నాయి.

బేబీ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత.. ఆనంద్ దేవర కొండ నుంచి వచ్చిన సినిమా “గం గం గణేశా’. కంప్లీట్ కామెడీ , ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. దీనితో ఈ సినిమా విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. చక్కగా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉందని.. సోషల్ మీడియా రివ్యూవర్స్ చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న క్రమంలోనే.. మరోవైపు ఓటీటీ డీల్ కూడా అనుకున్న బడ్జెట్ కే క్లోజ్ అయిపోయిందట. ఏ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ సొంతం చేసుకుందని సమాచారం. దాదాపు స్ట్రీమింగ్ పార్ట్నర్ ఖరారు అయినట్లే . కానీ దానిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం.. థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా .. ఓటీటీ లోకి వచ్చేందుకు నెల సమయం పడుతుంది. ఆ లెక్కన ఈ సినిమా జులై లో అమెజాన్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు ఉదయ్ శెట్టి దర్శకత్వం వహించారు. కాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా .. నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాతోనే వంశీ కారుమంచి ఇండస్ట్రీలో నిర్మాతగా పరిచయం అయ్యారు. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి అంతటా పాజిటివ్ ఏ నడుస్తుంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి. మరి గం గం గణేశా ఓటీటీ డీటెయిల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments