OTT Best Horror Thriller: OTTలో బిగ్గెస్ట్ హర్రర్ మూవీ! ప్రతి సీన్ క్లైమాక్స్ రేంజ్ లో!

OTT Movie Suggestion: ఎలాగూ ఈ వారం చూడదగిన సినిమాలు కొన్నే ఉన్నాయి కాబట్టి.. ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ కావాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూడాల్సిందే. మరి మీరు ఈ సినిమాను చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Movie Suggestion: ఎలాగూ ఈ వారం చూడదగిన సినిమాలు కొన్నే ఉన్నాయి కాబట్టి.. ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ కావాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూడాల్సిందే. మరి మీరు ఈ సినిమాను చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఓటీటీ లో వేల సంఖ్యలో సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. ఇంత కంటెంట్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని సినిమాలను మిస్ చేయడం అనేది సహజం. అటువంటి వారి కోసమే ఈ సినిమా సజ్జెషన్. ఒకవేళ మీరు మిస్ చేసిన సినిమాలలో కనుక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఉందేమో ఓ లుక్ వేసేయండి. సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది, ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్స్ చివరి వరకు ప్రేక్షకులను కదలనివ్వకుండా చేస్తాయి. కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ ఏ ఉంటుంది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఇందులో హర్రర్ ఎలెమెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇదొక హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరు ఉండరు. కన్నతల్లి ప్రేమకు మించిన ప్రేమ మరొకటి ఉండదు. ఇలా తల్లి గురించి ఎంతో గొప్పగా వింటూ ఉంటాము. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలోని తల్లి పాత్ర గురించి తెలుసుకుంటే మాత్రం ప్రపంచంలో ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని ఫీలింగ్ కలుగుతుంది. 1673వ సంవత్సరంలోని ఓ సీన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. మెక్సికోలో ఓ అందమైన కుటుంబం.. ఉంటుంది. ఆ భార్య భర్తలిద్దరూ పిల్లలతో కలిసి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఓ రోజు వారంతా కళ్ళగంతలు ఆడుతూ ఉంటారు. పెద్ద కొడుకు కళ్ళు తెరచి చూసేసరికి తన తల్లి తమ్ముడు కనిపించరు. వాళ్ళని వెత్తుకుంటూ వెళ్లిన అతనికి తల్లి క్రూరత్వం గురించి బయటపడుతుంది. ఆమె తన కొడుకుని నీటిలో ముంచి చంపేస్తుంది. దానిని కళ్లారా చూసిన పెద్ద కొడుకు తన తల్లికి దొరకకుండా పారిపోదాం అనుకుంటాడు. కానీ, ఫలితం ఉండదు.. తన తల్లికి చిక్కుతాడు.

కట్ చేస్తే.. 1973లో లాస్ ఏంజెల్స్ లో ఆనా అనే మహిళ ఓ సోషల్ సర్వీస్ వర్క్ చేస్తుంటుంది. పేరెంట్స్ వాళ్ళ పిల్లలను సరిగా చుస్కుంటున్నారా లేదా అని తెలుసుకోడమే ఆమె వర్క్. ఈ క్రమంలో ఆమెకు పాట్రీషియా అనే మహిళ కేసు ఎదురౌతుంది. ఆ కోసం విచారణ కోసం ఓ రోజు పాట్రిషియ ఇంటికి వెళ్తే.. ఆమె ఎందుకో చాలా భయంగా కనిపిస్తుంది. ఆమె పిల్లలు ఎక్కడ ఉన్నారని ఆనా వెతుకుతుండగా ఆమెపై పాట్రిషియ దాడి చేస్తుంది. ఎలాగూ ఒకలా తప్పించుకుని .. భయంతో బిక్కు బిక్కు మంటున్న ఆ పిల్లలను కాపాడుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఆ పిల్లలు ఇద్దరు చనిపోయి ఓ నదిలో శవాలై తేలుతూ ఉంటారు. ఆనా తన పిల్లలతో సహా ఆ ప్రదేశానికి వెళ్తుంది. ఆ పిల్లల తల్లి పాట్రీషియా తల్లి కూడా వస్తుంది.

‘నువ్వే నా బిడ్డలను చంపేసావు.. ఇంకా ఒక్కరోజైతే నా పిల్లలు లా ల్లోరోనా నుంచి విముక్తి పొందేవారు’ అంటూ ఆనాపై అరుస్తుంది. వీళ్ళను ఎవరు చంపారు అంటే లా ల్లోరోనా అని చెప్తుంది. అసలు కథ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇంతకీ ఆమె ఎవరు ? చిన్న పిల్లలను ఎందుకు చంపేస్తుంది ? ఆమె దెయ్యమా ! మనిషా ! ఆమె ఆనా పిల్లలను ఏమన్నా చేస్తుందా ! ఏమో ఇవన్నీ తెలియాలంటే ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉండే “ది కర్స్ ఆఫ్ లా ల్లోరోనా” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments