Swetha
ప్రతి వారం లానే ఓటీటీ లో సినిమాల అప్ డేట్ కోసం మరొక వారం వచ్చేసింది. మరి ఈ వారం ఏ ఏ సినిమాలు , ఏ ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను ఆల్రెడీ చూసే ఉంటారు. మరి వాటిలో అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలేంటో చూసేద్దాం.
ప్రతి వారం లానే ఓటీటీ లో సినిమాల అప్ డేట్ కోసం మరొక వారం వచ్చేసింది. మరి ఈ వారం ఏ ఏ సినిమాలు , ఏ ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను ఆల్రెడీ చూసే ఉంటారు. మరి వాటిలో అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలేంటో చూసేద్దాం.
Swetha
ఈ వారం మూవీ లవర్స్ కు కాస్త నిరాశ ఎదురైన మాట వాస్తవమే.. ఎందుకంటే అటు థియేటర్ లోబ్య్ సినిమాలు లేవు, ఇటు ఓటీటీ లోను పెద్దగా చెప్పుకోదగిన సినిమాలు లేవు. దీనితో మూవీ లవర్స్ కాస్త డల్ అయ్యారు. అయితే ప్రతి వారం పదుల సంఖ్యలో ఓటీటీ లో సినిమాలు రిలీజ్ అయినా కూడా.. వాటిలో చూడదగిన సినిమాలు మాత్రం కొన్నే ఉంటాయి. అలాగే వారం రిలీజ్ అయినా సినిమాలలో కూడా కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ తెప్పించే విధంగా ఉన్నాయి. మరి ఈ వారం అస్సలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.
ఈ వారం అన్ని ప్లాట్ ఫార్మ్స్ లో కలిపి 19 కి పైగానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో ఈ సినిమాలను మాత్రం అసలు మిస్ చేయకుండా చూసి ఎంజాయ్ చేసేయండి. ఆ సినిమాలేంటంటే..
ఈ సీజన్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన మొదటి రెండు సీజన్స్ కూడా ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకున్నాయి. దీనితో ఈ సిరీస్ పై అందరికి భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సిరీస్ మే 28నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
హారర్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వారికి ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. హారర్ జోనర్ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మే 30 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ కాకుండా చూసేయండి.
ఈ మధ్య కాలంలో వచ్చే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు.. ఫ్యామిలితో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేస్తూ సినిమా చూడాలని అనుకుంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి, ఈ సినిమా మే 30 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా చిన్న పిల్లల దగ్గరనుంచి.. పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా. దేశ స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. అలాంటి వారిలో ఒకరు వినాయక్ దామోదర్. ఇతని జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని రూపొందించినదే ఈ సినిమా. ఈ మూవీ మే 28 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 15న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా సరైన ప్రమోషన్స్ లేకపోవడం, పైగా రిలీజ్ ఆలస్యం కావడంతో థియేటర్లలో రామన్న యూత్ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమా మే 30 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.
మలయాళ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎంత ఫిదా అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే ఈ మలయాళ సినిమాను డైరెక్ట్ గా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా మే 30 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఫహద్ ఫాజిల్ నటించిన ఓ తమిళ మూవీ ఇది. ఈ సినిమా ఆల్రెడీ ఆపిల్ టీవీ ప్లస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ అంతగా బజ్ వినిపించలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా డైరెక్ట్ గా యూట్యూబ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా మే 31 నుంచి యూట్యూబ్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రీ గా చూసి ఎంజాయ్ చేసేయండి.
సుహాస్ నటించిన ఈ సినిమా థియేటర్ లో వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. అయితే థియేటర్ లో డిసాస్టర్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఆహతో పాటు యూట్యూబ్ లో కూడా మే 30 నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఓటీటీ లో ఈ సినిమా ఎంతమందిని మెప్పిస్తుందో వేచి చూడాలి.
కాబట్టి ఈ వారం ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూడండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.