OTTలోకి హనుమాన్.. నిన్న హిందీలో.. ఈ రోజు తెలుగులోకి

జనవరి 12 సంక్రాంతి బరిలో దిగిన పాన్ ఇండియా చిత్రం హనుమాన్.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చూపులకు ఎట్టకేలకు తెరపడింది.

జనవరి 12 సంక్రాంతి బరిలో దిగిన పాన్ ఇండియా చిత్రం హనుమాన్.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చూపులకు ఎట్టకేలకు తెరపడింది.

ప్రశాంత్ వర్మ- తేజ సజ్జా కాంబోలో విడుదలైన సూపర్ హీరో చిత్రం హనుమాన్. చిన్న బడ్జెట్‌లో కూడా అద్భుతమైన విజువల్ వండర్స్ తెరకెక్కించవచ్చునని నిరూపించాడు ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్. సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలు ఉన్నా.. తన మూవీ మీద ఉన్న నమ్మకంతో డేర్ చేసి రిలీజ్ చేశాడు. అతడి నమ్మకాన్ని నిలబెట్టడమే కాదు.. బాలీవుడ్ సైతం ముక్కున వేలేసుకుంది. రూ.40 కోట్లతో రిలీజ్ అయిన హనుమాన్.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 330 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది. ఇదిలా ఉంటే.. సంక్రాంతి బరిలో దిగిన సినిమాలన్నీ ఓటీటీకి వచ్చేయగా.. హనుమాన్ మాత్రం రాలేదు. ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.

నెల రోజుల్లో వచ్చేస్తుంది కదా అని భావించారు. పిక్చర్ విడుదలై.. రెండు నెలలు దాటి పోతున్నా ఎలాంటి అప్ డేట్ లేదు. అంతలో సడెన్‌గా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది హనుమాన్.  హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ అయ్యింది.  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులకు సంభ్రమాశ్చరంలో ముంచెత్తేలా చేసింది.  తెలుగు రైట్స్ ను జీ 5 కొనుగోలు చేసిన సంగతి విదితమే. ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతున్నట్లు ప్రకటించింది సదరు ఓటీటీ సంస్థ. శనివారం రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతోన్నట్లు తెలుస్తోంది. హనుమాన్ హిందీ వర్షన్ హక్కులను జియో కొనుగోలు చేసింది. అలాగే కలర్స్ సినీ ప్లెక్స్ ఛానల్లోనూ హనుమాన్ టెలికాస్ట్ అయ్యింది. ఒకేసారి టెలివిజన్, ఓటీటీలో ప్రసారమైంది ఈ చిత్రం.

అయితే శివరాత్రి సందర్బంగా మార్చి 8న సందడి చేసే అవకాశాలున్నాయంటూ వార్తలు వినిపించాయి. కానీ రాలేదు. దీంతో ఓటీటీ లవర్స్ ఫైర్ అయ్యారు. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో మాకు కూడా అప్డేట్ లేదంటూ సమాధానం ఇచ్చింది జీ5. అదే సమయంలో ప్రశాంత్ వర్మను ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధించడంతో.. ఆయన కూడా స్పందించాల్సి వచ్చింది. హనుమాన్ ఓటీటీ రిలీజ్ వాయిదా పడటం కావాలని చేస్తుంది కాదని, తర్వలో అప్డేట్ ఇస్తామంటూ అభిమానులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తానికి  ఈ మూవీ కోసం కళ్లు కాయలు కాచేలా తెలుగు ప్రేక్షకులు చూసిన ఎదురు చూపులకు ఫలితం దక్కింది. జనవరి 12న హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

Show comments