Swetha
ఓటీటీ లలో వచ్చే అన్ని సినిమాలను, సిరీస్ లను ప్రేక్షకులు మెప్పిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం రియల్ లైఫ్ డాక్యుమెంటరీస్ ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో సినిమా ఓటీటీ లోకి రాబోతుంది.
ఓటీటీ లలో వచ్చే అన్ని సినిమాలను, సిరీస్ లను ప్రేక్షకులు మెప్పిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం రియల్ లైఫ్ డాక్యుమెంటరీస్ ను చూసేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో సినిమా ఓటీటీ లోకి రాబోతుంది.
Swetha
ఓటీటీ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తూనే ఉన్నా సరే.. డాక్యుమెంటరీస్ కు మాత్రం స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఓటీటీ లోకి వచ్చిన అన్ని డాక్యుమెంటరీ మూవీస్ , సిరీస్ లను ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఏదైనా ఓ డాక్యుమెంటరీ సినిమాలో కానీ, సిరీస్ లో కానీ.. ఎంతో మందికి తెలియని నిజ నిజాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు, దీనితో అసలు అక్కడ ఏమి జరిగిందో తెలుసుకునేందుకు ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ సైలెంట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. ఇది ఖచ్చితంగా అందరూ మహిళలు చూడాల్సిన సినిమా. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ప్రతి రోజు వార్త పత్రికలలో , న్యూస్ ఛానెల్స్ లో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను చూస్తూనే ఉన్నాము. కానీ దాని గురించి గట్టిగా ప్రశ్నించే వారు మాత్రం లేరు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా సరే.. దాని కోసం స్టాండ్ తీసుకుని ఆ సమస్యలను పరిష్కరించేవారు లేరు. ఈ క్రమంలో సృష్టి బక్షి అనే అమ్మాయి.. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు పాద యాత్ర చేస్తూ.. భారతదేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన కల్పించేందుకు.. తన వంతు ప్రయత్నం చేసింది. ఆమె కన్యాకుమారి నుంచి శ్రీనగర్ కు చేరుకునేందుకు ఆమెకు మొత్తం 230 రోజుల సమయం పట్టింది. 3,800 కిలో మీటర్ల పాటు నడక ప్రయాణాన్ని కొనసాగించి.. రికార్డు క్రియేట్ చేసింది. ఇదే స్టోరీని ఇప్పుడు ఓ డాక్యుమెంటరీగా తీసుకుని వచ్చారు. ఆ డాక్యుమెంటరీ పేరు ఉమెన్ ఆఫ్ మై బిలియన్(WOMB ). ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
కాగా, ఈ డాక్యుమెంటరీకి అజితేష్ శర్మ దర్శకత్వం వహించారు. సృష్టి బక్షి ఈ డాక్యుమెంటరీలో ప్రధాన పాత్రలో కనిపించారు. ఇక ఆమెతో పాటు.. నేహా రాయ్, ప్రగ్యా ప్రసూన్ సింగ్, సంగీత తివారీలు ముఖ్య పాత్రలు పోషించారు. అయితే, 2021 లో కెనడాలో ఈ డాక్యుమెంటరీని విడుదల చేసినపుడు అక్కడ మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. “3,800 కి.మీ., లెక్కలేనన్ని గొంతుకలు, ఒకే ఒక సెంటిమెంట్… మహిళలపై హింస సాంస్కృతికం కాదు, ఇది నేరం, ఇదెప్పటికీ ఆమోద యోగ్యం కాదంటూ” అంటూ అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. కాబట్టి ఇది ప్రతి మహిళ తప్పకుండా చూడాల్సిన డాక్యుమెంటరీ. మరి ఈ డాక్యుమెంటరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.