హైదరాబాద్‌లో WWE.. ప్రారంభమైన సూపర్ స్టార్ స్పెక్టకిల్ పేరిట ఈవెంట్..

హైదరాబాద్‌లో WWE.. ప్రారంభమైన సూపర్ స్టార్ స్పెక్టకిల్ పేరిట ఈవెంట్..

చాలా మందికి WWE అంటే చాలా ఇష్టం. ఆ ఈవెంట్ లో తమ ఫెవరెట్ స్టార్స్ గెలవాలని కూడా కోరుకుంటారు. అంతేకాక జీవితంలో ఒక్కసారైన ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ను లైవ్ లో చూడాలని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి అవకాశం తెలుగు వారికి రానే వచ్చింది.WWE మన హైదరాబాద్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కు మన హైదరాబాద్  సర్వం సిద్ధమైంది. సూపర్ స్టార్ స్పెక్టకిల్ పేరిట ఈవెంట్ ను జరపుతున్నారు. ఈ పోటీల్లో మన భారత WWE స్టార్స్ జిందర్ మహల్, వర్, సంగ కూడా పాల్గొననున్నారు. కాసేపటి క్రితమే అట్టహాసంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

హైదరాబాద్ లోని గచ్చిబౌలి లోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం ఈవెంట్ కి వేదికగా మారింది. హైదరాబాద్ వేదికగా తొలిసారి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్స్ తలపడనున్నారు. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. భారీ సంఖ్యలో ప్రేక్షకులు కూడా స్టేడియానికి తరలి వచ్చారు. ఈ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ఫ్రీకిన్ రోలిన్స్, మహిళ ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే,  డబ్ల్యూ డబ్ల్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌ల పోటీ పడుతున్నారు. వీరితో పాటు కీలక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్స్ కూడా ఈవెంట్ ల పోటీ పడుతున్నారు. వీరితో పాటు మన సూపర్‌స్టార్స్ జిందర్ మహల్, వీర్, సంగ కూడా బరిలోకి దిగారు.

మరో వైపు  స్టేడియం వద్ద పోలీసులు భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. 17 ఏళ్ల తరువాత ఇండియాకి జాన్ సేవా రావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్  చేరుకున్నారు. వారిని చూసేందుకు ఎయిపోర్టుకు పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలస నుంచి కూడా అభిమానులు స్డేడియానికి చేరుకున్నారు. ఈ మ్యాచ్ లో తమ అభిమాన ఫైటర్లను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి.. చాలా ఏళ్ల తరువాత WWE ఈవెంట్ హైదరాబాద్ లో జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments