Pushpa 2: అల్లు అర్జున్ కి ప్ర‌భాస్ క‌న్నా ఎక్కువ ఫీజు, 33 శాతం లాభాల్లో వాటా

పుష్ప: ది రైజ్(Pushpa: The Rise) ఇండియా, ఓవర్సీస్ బాక్సాఫీస్ అంతటా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. నిజానికి అంతకుమించి హిందీ ప్రేక్ష‌కుల‌తో ఎమోష‌న‌ల్ బాండింగ్ వ‌చ్చింది. డ‌బ్బింగ్ సినిమాతోనే బాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ కి వెళ్లిపోయాడు అల్లు అర్జున్. 170-200 కోట్లతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పుష్ప‌, ప్రపంచవ్యాప్తంగా రూ. 355-365 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. అంద‌రికీ ఇది విన్-విన్ సినిమా. అంద‌రూ లాభ‌ప‌డ్డారు. ఇప్పుడు, పుష్ప 2 షూటింగ్ ఆగస్టు నుండి మొదలుపెట్ట‌డానికి టీం రెడీ అవుతోంది. ఫ‌స్ట్ పార్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ కాబ‌ట్టి, హీరో అల్లు అర్జున్, డైరెక్ట‌ర్ సుకుమార్ ఇద్దరూ భారీగా రెమ్యునిరేష‌న్స్ తీసుకొంటున్నారు. సినిమా వ‌ర్గాల ప్ర‌కారం అల్లు అర్జున్ ఎక్కువ ఫీజును డిమాండ్ చేశారు.

పుష్ప: ది రూల్( Pushpa: The Rule) కోసం అల్లు అర్జున్ తన ఫీజుగా రూ. 150-175 కోట్లు వ‌ర‌కు వసూలు చేస్తున్నాడంట‌. సుకుమార్ కూడా ఫ‌స్ట్ పార్టుక‌న్నా మూడింత‌లు ఫీజు పెంచేశారు. మొత్తం 75 కోట్లు తీసుకోనున్నారు. ఈ లెక్క‌న హీరోకి, డైరెక్ట‌ర్ కి క‌లిపి ఫీజు రూ. 200 కోట్లు.

ఇక‌, పుష్ప పార్ట్ 2కి ప్రొడ‌క్ష‌న్ ఖ‌ర్చు దాదాపు 150 కోట్లు ఉంటుందన్న‌ది మ‌రో అంచనా. ఇందులో ప్రొడ‌క్ష‌న్ , ప్ర‌మోష‌న్ ఖ‌ర్చులు క‌లిపే ఉన్నాయి. భారీ బ‌డ్జెట్ కాబ‌ట్టి, ఎక్కువ‌గా షూటింగ్ సమయం వృధా కాకుండా, శరవేగంగా షూటింగ్ చేస్తానని సుకుమార్ భ‌రోసా నిచ్చారని తెలుస్తోంది. సుకుమార్ అంటేనే ఎక్కువ కాల్షీట్లు కావాలి.

నాన్ థియేట్రికల్ డీల్స్ భారీగా రానున్నాయి. అందుకే ఆ ఫిగ‌ర్ బైట‌కు రానివ్వ‌ద్ద‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ కి చెప్పారు. ఇక రంగంలోకి దిగిన‌ అల్లు అరవింద్, విడుదలకు ముందే OTT ఒప్పందాలను ఖరారు చేస్తారు.

ఒక‌వేళ పుష్ప పార్ట్ 2కూడా బ్లాక్ బస్టర్ అయితే, సినిమా లాభాలలో 40 శాతం హీరో, డైరెక్ట‌ర్ కే రానుంది. ఈ మేర‌కు ఒప్పందాలు జ‌రిగిపోయాయి. అంటే మైత్రీ మూవీ మేక‌ర్స్‌కి సినిమా స‌క్సెస్ అయితే 20 శాతం రేంజ్‌లో మిగులుతుంద‌న్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల మాట‌. 2023లో వేసవి విడుదల కోసం మంచి డేట్ చూస్తున్నారు.

Show comments