బాహుబలి 2 తర్వాత ఆ క్రెడిట్ పుష్ప రాజ్ దే..!

చిన్న సినిమాలు కూడా ముందు రోజు ప్రీమియర్స్ వేయాలంటే భయపడుతూ ఉంటాయి. టాక్ బాగానే వస్తే పర్లేదు.. మీడియా సోషల్ మీడియాలో ఆ సినిమాకు పబ్లిసిటీ బాగా అవుతుంది. కానీ ఒకవేళ ఏ మాత్రం తేడా కొట్టినా.. అసలు రిలీజ్ రోజు ఫస్ట్ షో కే జనం కనిపించకుండా పోతారు.

చిన్న సినిమాలు కూడా ముందు రోజు ప్రీమియర్స్ వేయాలంటే భయపడుతూ ఉంటాయి. టాక్ బాగానే వస్తే పర్లేదు.. మీడియా సోషల్ మీడియాలో ఆ సినిమాకు పబ్లిసిటీ బాగా అవుతుంది. కానీ ఒకవేళ ఏ మాత్రం తేడా కొట్టినా.. అసలు రిలీజ్ రోజు ఫస్ట్ షో కే జనం కనిపించకుండా పోతారు.

చిన్న సినిమాలు కూడా ముందు రోజు ప్రీమియర్స్ వేయాలంటే భయపడుతూ ఉంటాయి. టాక్ బాగానే వస్తే పర్లేదు.. మీడియా సోషల్ మీడియాలో ఆ సినిమాకు పబ్లిసిటీ బాగా అవుతుంది. కానీ ఒకవేళ ఏ మాత్రం తేడా కొట్టినా.. అసలు రిలీజ్ రోజు ఫస్ట్ షో కే జనం కనిపించకుండా పోతారు. మహా అయితే తమ అభిమాన హీరో కోసం ఫ్యాన్స్ మాత్రమే కాస్త హడావిడి చేస్తుంటారు. సో ఇలా రిలీజ్ కు ముందు రోజు రోజు ప్రీమియర్స్ వేయడం.. రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఇవన్నీ చిన్న సినిమాలు , మీడియం రేంజ్ సినిమాల వరకు మాత్రమే పరిమితం అయ్యే సాహసాలు. పెద్ద హీరోల సినిమాలేమి కూడా ఇలాంటి సాహసాలు అసలు చేయవు. ఇంకా చెప్పాలంటే దర్శక నిర్మాతలకు అలాంటి ఆలోచన కూడా ఉండదు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టైర్ 1 హీరోల సినిమాలలో ఒక్క బాహుబలి 2 సినిమాకు మాత్రమే ముందు రోజు రాత్రి ప్రీమియర్స్ వేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు మరే సినిమాకు ఇలాంటిది జరగలేదు.

ఇక ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పుష్ప 2 విషయంలో ఇది జరుగుతుంది. డిసెంబర్ 4 రాత్రి షోస్ వేసేందుకు టీం రెడీ అయ్యారు. దీనిని బట్టే వారు ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నారో అర్థంచేసుకోవచ్చు. ఎందుకంటే సినిమా గురించి పాజిటివ్ టాక్ అయినా నెగిటివ్ టాక్ అయినా చాలా త్వరగా మీడియా , సోషల్ మీడియాలో పాకేస్తుంది. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా బన్నీ గురించి నెగిటివిటి స్ప్రెడ్ చేసేందుకు రెడీ గా ఉన్న వర్గాలు లేకపోలేదు. ఇదంతా కాకుండా ఇప్పటివరకు అనుకున్న విధంగా టాక్ వచ్చేస్తే మాత్రం.. రిస్క్ తీసుకోవడం వలన వచ్చే నష్టమేమి లేదు. కానీ ఇక్కడ మరో ఇబ్బంది కూడా లేకపోలేదు. ఫ్యాన్స్ అత్యుత్సాహం , ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ , థియేటర్ లో సినిమాను వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం ,ట్విస్ట్ లు చెప్పేయడం , ఎవరికి తోచిన రివ్యూలు వారు ఇవ్వడం.. ఇవన్నీ బాగా ఇబ్బంది పెట్టె విషయాలు.. మూవీ మేకర్స్ కు వీటిని కట్టడి చేయడం అతి పెద్ద సవాల్.

సో ఈ లెక్కన పుష్ప2 చేస్తుంది చిన్న సాహసం కాదని ఈపటికే అందరికి అర్ధమయ్యి ఉంటుంది. పైగా గత కొన్నేళ్లలో మరే సినిమా ప్రీమియర్ కు టికెట్ రేట్ వెయ్యి రూపాయలకంటే ఎక్కువ దాటలేదు. కానీ పుష్ప రాజ్ మాత్రం ఏకంగా 1200 వరకు రాబడుతున్నాడు. ఏపీ లో కూడ దాదాపు ఇలాంటి రేట్స్ ఏ ఉండబోతున్నాయని అంచనా. బాహుబలి టైం లో డార్లింగ్ , జక్కన్న కలిసి తీసుకున్న రిస్క్.. భారీ ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు పుష్ప2 కి అంతకుమించిన స్కేల్ ఏర్పడింది. మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఉండడం.. వస్తున్న అప్డేట్స్ ఇంకాస్త అంచనాలను పెంచడం.. ఇవన్నీ కూడా పుష్ప మేకర్స్ కు ఓ వైపు హైప్ ఇస్తూనే మరోవైపు భయపెడుతున్నాయని చెప్పి తీరాల్సిందే. అల్లు అర్జున్, సుకుమార్ చేయబోతున్న ఫీట్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments