తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 టార్గెట్ ఎంతంటే ?

Pushpa 2 Updates: దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగినట్లే మేకర్స్ కూడా అసలు తగ్గేదేలే అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్ బాధ్యతను బన్నీ తన భుజాలపై వేసుకుని.. ప్రతి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అక్కడి ప్రజలు బన్నీకి బ్రహ్మరథం పడుతున్నారు.

Pushpa 2 Updates: దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగినట్లే మేకర్స్ కూడా అసలు తగ్గేదేలే అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్ బాధ్యతను బన్నీ తన భుజాలపై వేసుకుని.. ప్రతి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అక్కడి ప్రజలు బన్నీకి బ్రహ్మరథం పడుతున్నారు.

దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగినట్లే మేకర్స్ కూడా అసలు తగ్గేదేలే అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్స్ బాధ్యతను బన్నీ తన భుజాలపై వేసుకుని.. ప్రతి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అక్కడి ప్రజలు బన్నీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ ఈవెంట్ పెట్టినా భారీగా జనం తరలివస్తున్నారు. ఇక అతి త్వరలో పుష్ప టీం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవెంట్ ను ప్లాన్ చేస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మూవీ రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి.. ప్రమోషనల్ పనులు మాత్రం చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. మేకర్స్ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆల్రెడీ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయింది. భారీ టార్గెట్ తో ఈ సినిమా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. పైగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే గతంలో తెలుగు రాష్ట్రాల్లో పుష్ప పార్ట్ 1 కి చెప్పుకోదగిన కలెక్షన్స్ రాలేదు. దానికి అప్పుడున్న టికెట్స్ రేట్స్ కూడా ఓ రీజన్. కానీ ఇప్పుడు అలా లేదు.. తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇవ్వనున్నాయి.

సో లెక్కన పుష్ప మీద ఇప్పుడు భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఆంధ్రాలో 90 కోట్లు, నైజంలో 100 కోట్లు, సీడెడ్ లో 30కోట్లకి ఈ సినిమా రైట్స్ ను అమ్మినట్లు తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 220 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇంత షేర్ అందుకోవాలంటే దాదాపు 450 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ సినిమా 415 కోట్లతో హైయెస్ట్ గ్రాస్ రాబట్టింది. ఆ తర్వాత బాహుబలి 2’ మూవీ 330 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో సెకండ్ హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది. అంటే పుష్ప 2 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఆర్ఆర్ఆర్ ను మించిన కలెక్షన్స్ రాబట్టాలి. ఇది అంత ఈజీ టార్గెట్ అయితే కాదు. టికెట్ ధరలు పెంచినా కూడా రెండు వారాల్లో 450కోట్ల గ్రాస్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఈ రేంజ్ లో వసూళ్లు అందుకోవాలంటే లాంగ్ రన్ లో స్టాండర్డ్ వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది. ఎలాగూ సంక్రాంతి వరకు సినిమాకు పోటీగా మరే సినిమా రిలీజ్ అవ్వడం లేదు. సో అప్పటికి కూడా ఈ సినిమాకు బజ్ ఉంటే అప్పుడు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎలా ఉన్నా కానీ నార్త్ , కేరళలో మాత్రం వారానికే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు అయితే కనుక పుష్ప 2 మూవీ ఒక కొత్త రికార్డ్ ను క్రియేట్ చేస్తుంది. సో ఇవన్నీ తెలియాలంటే డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments