Idream media
Idream media
తుగ్లక్ మరణించిన రోజు ఆయన దర్బార్లోని ఒక మహా కవి ‘పోనీ లెండి ..ప్రజలను చూడాల్సిన బాధ్యత నుంచి రాజుకు….ఈయన పిచ్చి చర్యలను భరించాల్సిన ఖర్మ నుంచి ప్రజలకు ఇన్నాళ్లకు విముక్తి కలిగింది” అన్నాడట. అది అక్షరాల నిజమే ..ఇప్పుడు పవన్ కళ్యాణ్ ,బీజేపీల మధ్య కుదిరిన ఒప్పందం విషయంలో కార్యకర్తలు, ప్రజలూ అలాగే అంటున్నారు.
”పొనిలేండి ..పార్టీని నడపాల్సిన బాధ్యత నుంచి పవన్ కు విముక్తి కలిగింది. .ఆయన పిచ్చి చేష్టలను భరించాల్సిన అగత్యం నుంచి కార్యకర్తలకు విముక్తి లభించింది.. ఇప్పుడు వాళ్ళు తమకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.
మొత్తానికి బిజెపి తో జనసేన పట్టు కుదిరిందో విలీనం అయిందో నిమజ్జనం అయిందో గాని పార్టీని నడపాల్సిన బాధ్యత మాత్రం పవన్ కు తప్పింది.. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం ఈ విలీన/పొత్తు పరిణామాలను కనీసం గుర్తించినట్లు లేదు
ఆయన పవన్ వెంట బీజేపీలోకి వెళ్లే సూచనలు కనిపించడం లేదు. గెలిచిన నాటి నుంచీ ఆయన్ను పవన్ తమ ఎమ్మెల్యేగా గుర్తించడం లేదు. గవర్నర్ లాంటి ప్రముఖులను కలిసినప్పుడు కూడా వరప్రసాద్ ను తీసుకెళ్ళలేదు. పొత్తు గురించి చర్చించినప్పుడు కూడా ఆయన్ను బిజెపి నేతల దగ్గరకు రానివ్వలేదు. తాను రెండు చోట్లా ఓడిపోయినా వరప్రసాద్ గెలవడం పవన్ కు ఇష్టం లేనట్లు తెలుస్తోంది. ఆయనపట్ల కాసింత అసూయను ప్రదర్శిస్తూ వచ్చిన పవన్, అవకాశం వచ్చినప్పుడల్లా ఎమ్మెల్యేను అవమానిస్తూనే ఉన్నారు.
అయితే రాపాక కూడా పవన్ ను తన లీడర్ గా గుర్తించడం లేదు. కేవలం తన వ్యక్తిగత ఇమేజితో గెలిచానే తప్ప తనకు పార్టీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన బాహాటంగానే చెబుతూ వస్తున్నారు. ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ను కొనియాడుతూ మెల్లగా వైఎస్సార్ కాంగ్రెస్ వైపు నడిచేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ఏ పరిస్థితుల నేపథ్యంలో తమ పార్టీ తరఫున గెలిచిన ఒజె ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లేకుండానే పవన్ ఒంటరిగా బిజెపి లోకి వెళ్లినట్లు స్పష్టమవుతోంది.