ఉల్లి పాట్లు- తోపులాటలు

  • Published - 08:39 AM, Tue - 17 December 19
ఉల్లి పాట్లు- తోపులాటలు

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల ఉల్లి కష్టాలు తీరడం లేదు. కారణం బహిరంగ మార్కెట్ లో ఉల్లిపాయల రేటు కేజీ వంద రూపాయల వరకు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద కేజీ 25 రూపాయలకే ఇస్తున్న ఉల్లిపాయలు కోసం జనం ఎగబడుతున్నారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సబ్సిడీ ఉల్లిపాయలు సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నాబహిరంగ మార్కెట్ లో ఉల్లి అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ ఉల్లి సరఫరా కేంద్రాలకి జనాలు క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల వేకువ జామునే భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ఊహించినదానికన్నా జనం ఎక్కువగా వస్తుండడంతో కొన్నిచోట్ల తోక్కిసలటలు, స్వల్ప ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి జనవరి మొదటివారం వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.

విజయనగర లోని ప్రభుత్వ ఉల్లి సరఫరా కేంద్రం వద్ద అధికారులు గేట్లు ఓపెన్ చెయ్యగానే జనం భారీగా దూసుకురావడం తో తొక్కిసలాతాకి దారి తీసిన దృశ్యం పై  వీడియోలో చూడవచ్చు

Show comments