బతికితే జార్జి రెడ్డి లాగే బతకాలి

జార్జి రెడ్డి మరణం దేశానికి తీరని లోటని, జార్జి హత్యకు గురై 47 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన పేరు ఉస్మానియా యూనివర్సిటీ లో ఇప్పటికీ మారుమో గుతూనే ఉందని జార్జి రెడ్డి మిత్రుడు, సినిమా నిర్మాత, దర్శకుడు అయిన తమ్మారెడ్డి భరద్వాజ గారు తెలిపారు. జార్జి జీవితం, ఆయన ఆశయాలు, హత్యకు సంబంధించిన ఎన్నో ఆసక్తి కరమైన అంశాలను ఆదివారం ఐ డ్రీమ్ నాగరాజు కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాను ఇంజినీరింగ్ విద్యార్థి అయినప్పటికీ జార్జి రెడ్డితో తనకు విడదీయరాని అనుబంధం ఉండేదన్నారు. సినిమా లో చూపించిన విధంగా జార్జి రెడ్డి క్యాంపస్ హాస్టల్ ఉండేవాడు కాదని, ఇంటి నుండి నడుచుకుంటూ…లేదా సైకిల్, బస్ లో వచ్చే వారన్నారు. జార్జి రెడ్డి జీవితం ప్రేమ అన్న పదమే లేదన్నారు. మరొక విషయం ఏమిటంటే జార్జి రెడ్డి కి డ్రైవింగ్ రాదని..ఎప్పుడైనా సైకిల్ పై మాత్రమే వచ్చేవారాన్నరు. జార్జి రెడ్డి కమ్యునిస్ట్ భావజాలం కలిగి ఉన్నప్పటికీ అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో బీరకాయ పీచు సంబంధాలు ఉండేవని ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. జార్జి రెడ్డి హత్యకు గురయ్యే ముందువరకు తన వెంటే ఉన్నారని, ఇంజనీరింగ్ కాలేజీ లో ఉన్న జార్జి రెడ్డి నీ 1972, ఏప్రిల్ 14 న మధ్యాహ్నము 1.30 గంటల సమయం లో తానే స్వయంగా యూనివర్సిటీ లైబ్రరీ లో డ్రాప్ చేసి వెళ్లానని, తరువాత జార్జి ఇంజినీరింగ్ కాలేజి కి ఎందుకు వెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు అన్న విషయాలు ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పారు…జార్జి రెడ్డి నీ హత్య చేసింది ఎబివిపి అని నేరుగా చెప్పకపోయినా ఆ అవసరం వారికే ఎక్కువ ఉందన్నారు. ఇక లకన్ సింగ్ కు తనకు ఉన్న అనుబందం, లకణ్ సింగ్ కు సంభందించి న మరిన్ని ఆసక్తి కరమైన ఆంశాలు ఈ ఇంటర్వ్యూ లో భరద్వాజ గారు వివరించారు. ఒక్కటి మాత్రం చెప్పొచ్చు జార్జి రెడ్డి గురించి భరద్వాజ్ గారు ఇంటర్వ్యూ లో చెప్పినపుడు బతికితే జార్జి రెడ్డి లాగే బతకాలని అనిపించింది. జార్జి రెడ్డి కు సంభందించి భరద్వాజ్ గారు చెప్పిన మరిన్ని ఆసక్తి కరమైన ఆంశలకోసం ఐ డ్రీమ్ లో త్వరలో ప్రసారమయ్యే ఇంటర్వ్యూ ను చూడగలరు.

Show comments