ఎమ్మేల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి స్వల్ప అస్వస్థత.

  • Published - 05:40 AM, Tue - 10 December 19
ఎమ్మేల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి స్వల్ప అస్వస్థత.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి స్వల్ప ఆస్వస్థతకు గురయ్యారు. రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆయన సభ మధ్యలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వెంటనే సభ నుంచి బయటకు వచ్చేశారు. గమనించిన సహచర ఎమ్మెల్యే లు అసెంబ్లీ ఆవరణం లోని ప్రాథమిక చికిత్సా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు చికిత్స అందించారు.

బీపీ డౌన్ అవడం తో కోటం రెడ్డి అస్వస్థతకు గురైనట్లు తేల్చారు. అనంతరం ఆయనను విజయవాడ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆయన వెంట సహచర ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

Show comments