రాహుల్ కు కేసీఆర్ సపోర్ట్, ఆ సిఎంను బర్తరఫ్ చేయాల్సిందే…!

ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అసోం సిఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. రాహుల్ గాంధీ… రాజీవ్ కొడుకు అని మేము ఋజువు అడగలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి. దీనిపై పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు దీనిపై కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అటు బిజెపి కార్యకర్తలు సైతం కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేసారు.

ఇక దీనిపై సిఎం కేసీఆర్ సైతం స్పందించి అభ్యంతరం వ్యక్తం చేసారు. రాహుల్ గాంధీ పై అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫైర్ అయ్యారు. మోడీ ఇదేనా మీ పార్టీ మీ మర్యాద అంటూ నిలదీశారు. బిజేపి- అస్సాం సీఎం పై నిప్పులు చెరిగిన కేసీఆర్… దేశ సంస్కృతిపై గౌవరం ఉంటే- అస్సాం ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఇక కేంద్ర ప్రభుత్వ విధానాలను సైతం ఈ సందర్భంగా సిఎం కేసీఆర్ ఎండగట్టారు.

మోడీకి పిచ్చి ముదిరిపోయి పిచ్చి పిచ్చి పాలసీలు తెస్తున్నారు అని సిఎం ఘాటు కామెంట్స్ చేసారు. ఏడాది పాటు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. మోడీ ప్రభుత్వానికి మెంటల్ అయిపోయి- పిచ్చి ఎక్కి రైతులతో గెలుక్కుంటున్నారు అని కామెంట్స్ చేసారు. మోడీని తరిమి తరిమి కొట్టాలి అని పిలుపునిచ్చారు. 8 ఏళ్ల బీజేపీ పాలనలో దేశాన్ని సర్వనాశనం చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఏంది చూసేది తోకమట్టనా? కేసీఆర్ సంగతి చూస్తా అంటే భయపడడు అంటూ తన మార్క్ కామెంట్స్ చేసారు. ఈ దేశం ఎవని అయ్యా సొత్తు కాదు- నరేంద్ర మోడీ సిగ్గుపడాలి అని హితవు పలికారు. హిజాబ్ అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్… మతపిచ్చి లేపి కర్ణాటక లో ఆడపడుచులను ఆగం చేస్తున్నారు అని ఆయన ఘాటు కామెంట్స్ చేసారు. బిజెపి వాళ్ళు కుక్కల లెక్క అరవడం మానాలి అని హితవు పలికారు. పొద్దున లేస్తే కర్ఫ్యూలు- ఘర్షణలు అవసమా? అని ఆయన నిలదీశారు.

Also Read : ఏపీకి ప్రత్యేకహోదా దిశగా కేంద్రం అడుగులు, ఫలించిన జగన్ ఒత్తిడి

Show comments