Satyadev Best Movies In OTT: సత్య దేవ్ కెరీర్ లోనే ఈ 3 బెస్ట్ మూవీస్.. ఏ OTTల్లో చూడాలంటే?

Satyadev Best Movies In OTT: సత్య దేవ్ కెరీర్ లోనే ఈ 3 బెస్ట్ మూవీస్.. ఏ OTTల్లో చూడాలంటే?

OTT Movie Suggestions - Satyadev Best Movies In OTT: ఎప్పుడు హాలీవుడ్ , కోలీవుడ్ మూవీస్ ఏనా కాస్త రొటీన్ కి భిన్నంగా తెలుగులో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. అందులోను ఇప్పుడిప్పుడే కెరీర్ లో మంచి పేరు సంపాదించుకుంటున్న ఓ హీరో మూవీస్ ఇవి. మరి అవేంటో చూసేద్దాం.

OTT Movie Suggestions - Satyadev Best Movies In OTT: ఎప్పుడు హాలీవుడ్ , కోలీవుడ్ మూవీస్ ఏనా కాస్త రొటీన్ కి భిన్నంగా తెలుగులో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. అందులోను ఇప్పుడిప్పుడే కెరీర్ లో మంచి పేరు సంపాదించుకుంటున్న ఓ హీరో మూవీస్ ఇవి. మరి అవేంటో చూసేద్దాం.

టాలీవుడ్ లో ఎంతో మంది యంగ్ హీరోలు కొత్త కొత్త సినిమాలతో తమ టాలెంట్ ను కనబరుస్తున్నారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే తమ విలక్షణమైన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అటువంటి వారిలో ఇప్పుడు ప్రేక్షకుల నుంచి బాగా వినిపిస్తున్న హీరో పేరు సత్య దేవ్. సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఓ మంచి హీరోగా ఎదిగాడు సత్య దేవ్. ఈ క్రమంలో తాజాగా సత్య దేవ్ నటించిన సినిమా “కృష్ణమ్మ”. ఇప్పుడు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సత్యదేవ్ కు సంబంధించిన సినిమాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని సెర్చ్ చేసేస్తున్నారు. మరి ఆ సినిమాలు ఏంటో ఏ ఓటీటీ లో ఉన్నాయో చూసేద్దాం.

ఎప్పుడు హాలీవుడ్ , కోలీవుడ్ మూవీస్ ఏనా కాస్త రొటీన్ కి భిన్నంగా తెలుగులో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. అలా అని హారర్, మర్డర్ మిస్టరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలైతే కాదు. ఈ సినిమాలను ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఇంతకీ ఆ సినిమాలేంటంటే..

ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య : నెట్ ఫ్లిక్స్

ఒక మంచి వాడికి కోపం వస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ సినిమా కథ . దానిలో ఏముంది చూడడానికి అనుకుంటే పొరపాటే. ఇప్పటివరకు ఎన్నో రివెంజ్ కథలను చూసి ఉంటారు కానీ ఇలాంటి రివెంజ్ డ్రామా ను మాత్రం అసలు చూసి ఉంటారు. 2020 లో రిలీజ్ అయినా ఈ మలయాళ డ్రామా చిత్రానికి మంచి పేరే వచ్చింది. ఇక ఇప్పడు ఈ సినిమాను చూడాలంటే మాత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి.

బ్లఫ్ మాస్టర్ : అమెజాన్ ప్రైమ్

ఈ సృష్టినంతటిని నడిపేది డబ్బు. డబ్బును చూసే మనిషికి విలువను ఇస్తూ ఉంటారు. దీనితో కొంతమంది సరైన మార్గంలో డబ్బు సంపాదిస్తే.. మరి కొంతమంది అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. దీనిని ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమానే ఈ బ్లఫ్ మాస్టర్. 2018 లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి.

లాక్డ్ ( వెబ్ సిరీస్ ) : ఆహా

లాక్ డౌన్ సమయంలో వచ్చిన మంచి సినిమాలు, సిరీస్ లలో ఇది కూడా ఒకటి. థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు చూడాలి అనుకునే వారికి ఈ సిరీస్ బాగా నచ్చేస్తుంది. సాధారణంగా ఆ నోటా ఈ నోటా దీనిని వినే ఉంటారు. నలుగురికి మంచి చేసే క్రమంలో ఒక్కడికి చెడు జరిగిన పర్లేదు అని.. ఈ సిరీస్ ప్లాట్ అదే. కానీ ఆ చనిపోయే ఒక్కడు ఎవరు అనేది తెల్సుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. 2020 లో వచ్చిన ఈ సిరీస్ ఆహ లో , MX ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ఎవరైనా మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments