OTT Crime Susupense Thriller : పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో టాప్ లెవల్ మూవీ! ఒక్కో ట్విస్ట్ కు మైండ్ పోతుంది..

OTT Suggestion- Best Crime Suspense Thriller: ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూస్తే.. సినిమా మధ్యలో ట్విస్ట్ లు ఉన్నాయా.. ట్విస్ట్ ల మధ్యలో సినిమా ఉందా అనే డౌట్ రావడం ఖాయం. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Suggestion- Best Crime Suspense Thriller: ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూస్తే.. సినిమా మధ్యలో ట్విస్ట్ లు ఉన్నాయా.. ట్విస్ట్ ల మధ్యలో సినిమా ఉందా అనే డౌట్ రావడం ఖాయం. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ఇప్పటికే చాలా సినిమాలు చూసేశాం అని రిలాక్స్ అయితే .. కొన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మిస్ అయినట్లే. ఎందుకంటే ఓటీటీలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఇలాంటి సినిమాలను మిస్ చేస్తే ఎలా.. కాబట్టి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్ ని అసలు మిస్ చేయకుండా చుసేయండీ. వీటిలో ఏది ఇంట్రెస్టింగ్ మూవీ అని ఎలా తెలుస్తుంది అని అనుకునే వారి కోసమే ఈ మూవీ సజ్జెషన్. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా చూస్తే మాత్రం.. ట్విస్ట్ ల మధ్యలో సినిమా ఉందా సినిమా మధ్యలో ట్విస్ట్ లు ఉన్నాయా అనే డౌట్ రావడం ఖాయం. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ మూవీ స్టార్టింగ్ లో ఓ హారిక అనే మహిళ.. తన భర్త మిస్ అయ్యాడని కనిపించడంలేదని పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. అది విన్న పోలీసులు ఆమెను కొన్ని ప్రశ్నలు వేసి పంపించేస్తారు. కట్ చేస్తే కథను పదేళ్ల తర్వాత చూపిస్తారు. ఆరోజు హారిక కూతురు నిధి పుట్టిన రోజు.. దీనితో ఆమె నిధి పుట్టిన రోజును సెలెబ్రేట్ చేస్తుంది, కానీ నిధి హారికను తన తండ్రి గురించి అడుగుతుంది. హారిక ఏమి సమాధానం చెప్పకపోవడంతో.. నిధి తన తాతయ్యకు కాల్ చేసి తన తండ్రి గురించి అడుగుతుంది. దీనితో ఆ పెద్దాయన హారిక భర్త సంజయ్ మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఓ ఫైల్ ను నిధికి పంపిస్తాడు. ఆ ఫైల్ ఓపెన్ చేయగానే అందులో మిస్సింగ్ కేసుకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడతాయి.

గతంలో హారిక సంజయ్ గురించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు.. పోలీసులు సంజయ్ కు సంబంధించిన వారందరిని ఎంక్వయిరీ చేస్తారు. అసలు సంజయ్ మీకు ఎలా పరిచయం అని హారిక ను అడిగినప్పుడు.. వారిద్దరూ చిన్నపటినుంచి ఒకరంటే ఒకరికి ఇష్టమని చదువు పూర్తైన తర్వాత పెళ్లి చేసుకున్నామని.. రీసెంట్ గా నా పుట్టిన రోజున సంజయ్ నాకు ఎప్పటిలానే సర్ప్రైజ్ ఇచ్చాడు. కానీ ఆరోజున మా ఇద్దరి మధ్యన ఓ చిన్న గొడవ జరిగింది. దీనితో సంజయ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నేను అతనిని చూడడం అదే ఆఖరి సారి అని చెప్తుంది. కట్ చేస్తే స్టేషన్ కు మ్యాత్యు అనే ఓ వ్యక్తి వచ్చి.. తన గర్ల్ ఫ్రెండ్ కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తాడు. ఆ ఫోటో చూసి ఆ ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. ఎందుకంటే అది హారిక ఫోటో నే. కానీ నా గర్ల్ ఫ్రెండ్ పేరు అఖీరా అని వాళ్లిద్దరూ ట్విన్ సిస్టర్స్ అని చెప్తాడు. దీనితో ఆ ఇన్స్పెక్టర్ కు ఏమి అర్ధం కాదు.

ఇంకొన్ని రోజుల తర్వాత హారిక తన భర్త డెడ్ బాడీ తన ఇంటి కాంపౌండ్ లోనే దొరికిందంటూ.. మళ్ళీ పోలీసుల దగ్గరకు వస్తుంది. దీనితో ఈ కేసును సాల్వ్ చేస్తున్న కొద్దీ పోలీసులకు అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. దీనితో పోలీసులు హరికను మళ్ళీ ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీకు అఖీరా అనే ట్విన్ సిస్టర్ ఉందా, అని అడిగినప్పుడు.. తనకు ఎవరు సిస్టర్స్ లేరని ఆమె చెప్తుంది. ఇక్కడ నుంచి కేసు చాలా రకాల ట్విస్ట్ లతో ముందుకు సాగుతుంది. అసలు ఈ హత్య చేసింది ఎవరు? హారికకు అఖీరా అనే సిస్టర్ ఉందా ? ఉంటె ఆమె ఏమైంది ? మ్యాత్యు కు హారికకు ఏమైనా సంబంధం ఉందా ? సంజయ్ డెడ్ బాడీ హారిక ఇంట్లోనే ఎందుకు ఉంటుంది? పోలీసులకు ఇంకా ఎలాంటి ట్విస్ట్ లు ఎదురయ్యాయి ? చివరకు ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే “తత్సమ తద్భవ” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ఆఖరిలో వచ్చే ట్విస్ట్ మాత్రం అసలు మిస్ కాకుండ చూడండి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments