నాటి-నేటి ముఖ్యమంత్రుల దృక్పథంలో గమనించదగ్గ బేధాలు

  • Published - 11:08 AM, Sat - 9 May 20
నాటి-నేటి  ముఖ్యమంత్రుల  దృక్పథంలో గమనించదగ్గ  బేధాలు

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా వున్నపుడు పలు సందర్భాలలో ప్రజల మీద తన అక్కసు వెళ్లగక్కటం మనము మరచిపోలేము . వాటిలో ఎలక్షన్ల ముందు తాను చేసిన వ్యాఖ్యలు..

1.ఇతర పార్టీల శాసనసభ్యులు అడిగితే వారి నియోజక వర్గ పనులు తాను చేయనని గౌరు చరిత టీడీపీ లో చేరినపుడు చేసిన వ్యాఖ్యలు.
2 .నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సందర్భంలో తానిస్తున్న పెన్షన్లు తీసుకుంటూ,తానిచ్చిన బియ్యంతింటూ, తనరోడ్ల మీద నడుస్తూ తనకు ఓటు వేయకపోతే భవిష్యతులో వారికేమి పనులు చేయనని బెదిరింపు ధోరణిలో మాట్లాడటం మనమెవరం మర్చిపోలేదు.బహుశా ఆయనకు భయపడి ప్రజలు ఆ ఎన్నికల్లో ఓటేశారనిపిస్తుంది.
ఈ రెండు సందర్భాలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతావి.
3. పుష్కరాల తొక్కిసలాటలో 30 మంది దారుణంగా మృత్యువాతకి గురయ్యి , పలువురు గాయపడితే కుటుంబ సమేతంగా అక్కడే ఉన్న చంద్రబాబు కనీసం పరామర్శించకుండా పుష్కర స్నానం ముగించుకొని వెళ్లిపోవడాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు . ఆ ఘటనకు కారణమే బాబు అన్నది ప్రధాన ఆరోపణ .

అప్పటి ప్రజా సమస్యల పట్ల బాబు గారి స్పందన , ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ తీరు పరికించి చూస్తే

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఇండ్ల పట్టాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో కలెక్టర్లకు ఆదేశాలిస్తూ …పార్టీలకతీతంగా తమపార్టీకి ఓటు వేసినా వేయకపోయినా , అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలివ్వాలనడం వారి మానసిక, రాజకీయ పరిపక్వతకు పేద ప్రజలందరికి మంచి చేయాలనే తపన, నిజాయతీకి అద్దం పడుతుంది.

నాడు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక సామాజిక వర్గాల , పార్టీల వారీగా , టీడీపీ జన్మభూమి కమిటీల ఆమోదం పొందిన వారిని మాత్రమే ఎంపిక చేయగా , నేడు ఏ విధమైన రాజకీయ సమీకరణాలు చూడకుండా వలంటీర్ల ద్వారా అర్హులని గుర్తించి అందరికీ సంక్షేమ ఫలాలు అందించడం జగన్ పాలనా దక్షతని సూచిస్తుంది .

అలాగే నిన్న వైజాక్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరగ్గాన్నే స్పందించి తక్షణ చర్యలతో ఉపశమనం కలిగించటమే కాకుండా హుటాహుటిన బయల్దేరి వెళ్లి గ్యాస్ ప్రభావం పూర్తిగా వీడని రిస్క్ జోన్ లో స్వయంగా పర్యటించి రిస్క్ నివారణ చర్యలని పర్యవేక్షించి తగు ఆదేశాలివ్వటంతో పాటు , బాధితుల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పటంతో పాటు , ప్రాణ , ఆరోగ్య , ఆస్తి నష్టాలననుసరించి తక్షణమే భారీ పరిహారాన్ని ప్రకటించడం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులని సైతం నివ్వెరపోయేట్టు చేసి ఉండొచ్చు .

నాయకత్వం వహించడానికి కావల్సినది మానసిక పరిపక్వత , అభివృద్ధి చేయాలనే తపన, పాలనా దక్షిత ,నిజాయితీ మరియు నిబద్ధతే గాని.. ఎంత వయసు , ఎంత అనుభవం అని కాదు.

నాయకుడికి తరతమ భేదాలుంటే వారిని ప్రతి నాయకుడంటారు .అటువంటి వారు రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాలను ఉల్లంఘించి కుల, వర్గ, ప్రాంతీయ దురభిమానంతో పాలనా చేయడం రాజ్యాంగ విరుద్ధం . వారు పాలకులుగా అనర్హులు.

Show comments