పొరపాటుకు ఫలితం మరణమే

కోరికలను కంట్రోల్ చేసుకోవాలి… అది లైంగికం అయినా, ఇష్టం అయినా మరేదైనా కంట్రోల్ చేసుకోవాలి… ప్రేమ అయినా, కోపం, ఇష్టం, అయిష్టం ఏదైనా సరే మనం అదుపులో ఉంచుకున్నని రోజులూ జీవితానికి వచ్చిన సమస్య ఏదీ లేదు. మన మాట మనం విననప్పుడు జీవితం మన చేయి దాటినట్టే అనేది మనకు ఎన్నో సంఘటనల ద్వారా అర్ధమవుతూనే ఉంది. ఈ తరానికి తెలిసిన అత్యాచారాలు ఎన్ని ఉన్నా గత 15 ఏళ్ళ కాలంలో జరిగిన అత్యాచారాలు, ప్రేమ హత్యలు మాత్రం సమాజాన్ని భయపెట్టాయి.

విజయవాడలో మనోహర్ అనే యువకుడు పరీక్ష రాసే ఒక యువతీ మీద దాడి చేసి నరికి చంపిన ఘటన అప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఆ ఘటన తో అమ్మాయిలు కాలేజీలకు వెళ్ళాలి అంటే వణికిపోయారు. తల్లి తండ్రులు అయితే తమ కూతుళ్ళు అబ్బాయిలతో మాట్లాడటాన్ని కంట్రోల్ చేయడానికి నానా కష్టాలు పడ్డారు. ఆ యువకుడికి అప్పటి విజయవాడ సెషన్స్ కోర్ట్ ఉరి శిక్ష విధించింది. ఆ ఘటన తర్వాత వరంగల్ లో యాసిడ్ ఘటన వణుకు పుట్టించింది. ఇంజినీరింగ్ యువతీ మీద ఉన్న ప్రేమతో ఒక యువకుడు తన స్నేహితులతో యాసిడ్ దాడి చేసాడు.

వరంగల్‌లో 2008లో ఇద్దరు ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు స్వప్నిక, ప్రణీతలపై ఈ దాడికి పాల్పడ్డారు. వారిని మూడు రోజుల తర్వాత పట్టుకుని ఒక అడవిలో కాల్చి చంపారు. అప్పుడు వరంగల్ ఎస్పీగా సజ్జన్నార్ ఉన్నారు. నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణ తమ కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోతుండగా కాల్చి చంపినట్టుగా ఎస్పీ ప్రకటన చేసారు. ఈ ఘటన జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. తన కొడుకు చేసింది తప్పని కాల్చి చంపడం కరెక్ట్ అని శ్రీనివాస్ తండ్రి అప్పట్లో ఒక ఛానల్ తో మాట్లాడుతూ చెప్పారు.

Also Read : ఏపీలో నేరాలు తగ్గడానికి కారణాలేంటి..? ఎన్‌సీఆర్‌బీ నివేదిక ఏం బుతోంది..?

ఇక ఆ తర్వాత నాలుగేళ్లకు దేశ రాజధాని ఢిల్లీ లో నిర్భయ అనే యువతిని అర్ధరాత్రి బస్సులో అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేసారు. ఆమెను బ్రతికించుకోవడానికి ప్రత్యేక విమానంలో ఆమెను సింగపూర్ కూడా తరలించినా లాభం లేకపోయింది. ఆ నిందితులను గత ఏడాది తీహార్ జైల్లో ఉరి తీసారు. ఇక ఆ తర్వాత ఆ రేంజ్ లో సంచలనం అయిన కేసు… దిశా. ఒక యువతీ రోడ్డు మీద ఉన్న సమయంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి దారుణంగా రేప్ చేసి అత్యాచారం చేసారు. ఈ ఘటన నిందితులను పట్టుకుని వారం రోజుల్లో పారిపోయే ప్రయత్నం చేస్తుండగా కాల్చి చంపారు.

అప్పుడు సజ్జన్నార్ సైబరాబాద్ కమీషనర్ గా ఉన్నారు. ఆయన కమీషనరేట్ పరిధిలో ఈ ఘటన జరగడంతో చాలా సీరియస్ గా తీసుకున్నారు. నలుగురు నిందితులను పోలీసులు తెల్లవారుజామున కాల్చి చంపారు. ఇక ఇప్పుడు… చిన్నారి ఘటన. ఆరేళ్ళ చిన్నారిని రేప్ చేసి అత్యంత దారుణంగా చంపాడు రాజు అనే ఒక యువకుడు. వారం రోజుల పాటు తప్పించుకుని తిరిగాడు. చిన్నారిని చంపిన విధానం ప్రపంచాన్ని భయపెట్టింది. దాదాపుగా అతని కోసం వెయ్యి మంది పోలీసులు రాత్రనకా పగలనకా తిరిగారు.

చివరకు ఒక రైల్వే ట్రాక్ మీద అతను విగత జీవిగా కనిపించాడు. పోలీసులకు సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు అన్నీ కూడా ప్రేమ ఎక్కువై లేదా తమ ఆవేశాన్ని కట్టడి చేసుకోలేక, ప్రేమకు ఒప్పుకోలేదని లేదా కోరికలను అదుపులో పెట్టుకోలేక చేసిన నేరాలే ఇవి. అంతిమం… అది చట్టం వేసినా వాళ్లకు వాళ్ళు చేసుకున్నా… చివరకు చావే మిగిలింది. యువత తమను తాము కట్టడి చేసుకోవడం అనేది చాలా కీలకం. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

సోషల్ మీడియాతో సమాజానికి ఎంతో అవగాహన వస్తుంది. అయినా సరే దారి తప్పి ఉన్న ఒక్క జన్మను అత్యంత నీచంగా ముగించుకునే స్థితికి వెళ్తున్నారు. సమాజంలో తల్లి తండ్రులు, కట్టుకున్న వాళ్ళు, కడుపున పుట్టిన వాళ్ళు బ్రతికినన్ని రోజులూ అవమానం తో బ్రతకడమే. తండ్రి, కొడుకు, భర్త, తమ్ముడు, అన్న రేపిస్ట్, కిల్లర్ అని ముద్ర వేస్తే బ్రతికి ఉన్న వాళ్ళ పరిస్థితి అత్యంత నీచం. రాజు కుటుంబ సభ్యులు ఇప్పుడు సమాజంలో విలువ లేని వాళ్ళే. భార్య మీద ఉన్న ప్రేమతో మౌనిక అని పచ్చబొట్టు పోడిపించుకున్న వాడు… కూతురు వయసున్న పాపను రేప్ చేయడం అత్యంత హేయం. ఘటనలు చూసి నేర్చుకోవాలే గాని ఆ దారిలోకి వెళ్తే మీరు కూడా ఒక రాజు గానే వెళ్ళిపోతారు. మీ భార్య మౌనికగా మిగిలిపోతుంది.

Also Read : చైత్ర పాప కేసు – రైల్వే ట్రాక్ పై నిందితుడి శవం

Show comments