P Krishna
Toxic Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ మూవీ తర్వాత పాన్ ఇండియా హీరోగా యష్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం యష్ నటిస్తున్న మూవీ ‘టాక్సిక్’.
Toxic Movie: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ మూవీ తర్వాత పాన్ ఇండియా హీరోగా యష్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం యష్ నటిస్తున్న మూవీ ‘టాక్సిక్’.
P Krishna
భారతీయ సినీ చరిత్రలో కేజీఎఫ్, కేజీఎఫ్-2 మూవీస్ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిదే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ సినిమా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా హీరోగా యష్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం యష్ నటిస్తున్న మూవీ ‘టాక్సిక్’. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్, కియారా అద్వానీ కీ రోల్సో లో నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. ‘టాక్సిక్’ మూవీ షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి.కొద్ది రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ కోసం వేలాది చెట్లు నరికివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అది నిజమే అని కర్ణాటక అటవీ శాఖ మూవీ టీమ్ పై పోలీస్ కేసు పెట్టింది. ఇంతకీ ఈ మూవీ విషయంలో ఏం జరుగుతుందీ? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బెంగుళూరులోని పీణ్య- జలహళ్లి సమీపంలో యాష్ హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ మూవీ షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న భూమికి సంబంధించి కర్ణాటక అటవీశాఖ, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ మధ్య వివాదం కొనసాగుతుంది. గతంలో ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూమికి గెజిల్ లో ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ లేకుండా హెచ్ఎంటీకి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే భూమి యాజమాన్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతూ వస్తుంది.కొంత కాలంగా ఈ భూమిని వ్యాపార అవసరాల కోసం హెచ్ఎంటీ అద్దెకు ఇస్తుంది. ఈ క్రమంలోనే టాక్సిక్ మేకర్స్ ఈ భూమిని కొన్నిరోజుల పాటు లీజుకు తీసుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. లీజుకు తీసుకున్న భూమిలో షూటింగ్ నిమిత్తం వేలాది చెట్లను నరికివేశారంటూ సినీ మేకర్స్ పై ఆరోపణలు వచ్చాయి. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. స్వయంగా అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే.. ఈ ప్రాంతాన్ని సందర్శించి శాటిలైట్ ఫోటోలు తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అనుమతి లేకుండా చెట్లను నరికివేయడం, అటవీ చట్టాన్ని ఉల్లంఘించడమే ఇది శిక్షార్హమైన నేరంగా మంత్రి పేర్కొన్నారు.
ఈ విషయంపై ఇప్పుడు కర్ణాటక అటవీశాఖ సీరియస్ అయ్యింది. చెట్లను నరికివేయడం వల్ల పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగించినట్లే అని టాక్సిక్ మూవీ నిర్మాతలపై పోలీస్ కేసు పెట్టింది. అంతే కాదు కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ జనరల్ మేనేజర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ‘టాక్సిక్’ మూవీ 1970 గోవా, కర్ణాటక బ్యాగ్ డ్రాప్ లో ఉండబోతుందట. కేజీఎఫ్ తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ మూవీలో నటిస్తున్నాడు హీరో యష్. మరి ఈ సినిమాలో మనోడు ఎలాంటి అవతార్‌లో కనిపించబోతున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఏది ఏమైనా సినిమా రిలీజ్ కి ముందే ఇన్ని వివాదాలాలు వస్తున్నాయి.. రిలీజ్ తర్వాత ఎలా ఉండబోతుందో అంటూ సినీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.