Trinayani Serial Fame Pavitra Jayaram-Personal Life Struggles: 16 ఏళ్లకే పెళ్లి.. భర్తతో విడాకులు.. 'త్రినయని' నటి పవిత్ర జయరామ్ కష్టాలు!

16 ఏళ్లకే పెళ్లి.. భర్తతో విడాకులు.. ‘త్రినయని’ నటి పవిత్ర జయరామ్ కష్టాలు!

Trinayani Serial Fame Pavitra Jayaram: త్రినయని సీరియల్‌ ఫేమ్‌ తిలోత్తమ అలియాస్‌ పవిత్ర జయరామ్‌.. ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌ అవతుంది. తన జీవితంలో అనుభవించిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది పవిత్ర. ఆవివరాలు..

Trinayani Serial Fame Pavitra Jayaram: త్రినయని సీరియల్‌ ఫేమ్‌ తిలోత్తమ అలియాస్‌ పవిత్ర జయరామ్‌.. ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందింది. ఈ క్రమంలో ఆమె పాత ఇంటర్వ్యూ ఒకటి వైరల్‌ అవతుంది. తన జీవితంలో అనుభవించిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది పవిత్ర. ఆవివరాలు..

ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్‌ నటి పవిత్ర జయరామ్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. సొంత ఊరికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా..ప్రమాదం చోటు చేసుకుంది. పవిత్ర ప్రయాణిస్తున్న కారు.. మహబుబ్‌ నగర్‌ జిల్లా భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం దగ్గర ఉన్న జాతీయ రహదారి మీదుగా వస్తుండా..​ డివైడర్‌ను ఢీ కొట్టి అటు కుడి వైపున వస్తోన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందగా.. కారులో ఆమెతో ప్రయాణం చేస్తున్న వారు గాయపడ్డారు. ఇక పవిత్ర మరణంతో టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సహ నటులు, అభిమానులు పవిత్ర మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కన్నడ నటి అయిన పవిత్ర.. ప్రస్తుతం తెలుగులో వరుస సీరియల్స్‌లో యాక్ట్‌ చేస్తుంది. ముఖ్యంగా త్రినయని సీరియల్‌లో ఆమె పాత్ర ఎంతో ఫేమస్‌ అయ్యింది. తిలోత్తమ పాత్రలో ఆమె పలికించే హవాభావాలు సూపర్‌. కళ్లలోనే విలనీజం పండిస్తుంది. ఈ సిరియల్‌ ద్వారా ప్రేక్షకులకు చేరువైన పవిత్ర.. ప్రస్తుతం వివిధ సీరియల్స్‌లో నటిస్తోంది. ఇక పవిత్ర వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమెది కర్ణాటక. మాండ్యకు చెందిన పవిత్ర పెద్దగా చదువుకోలేదు. కానీ జీవితంలో సొంతంగా తనకంటూ గుర్తింపు ఉండాలని ఆశించేది. ఈ క్రమంలోనే మాండ్య నుంచి బెంగళూరుకు వచ్చి.. ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. పెద్ద చదువులు లేకపోవడంతో.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది.

ఇలాంటి సమయంలోనే పవిత్ర స్నేహితురాలు.. ఆమెను ఇండస్ట్రీ వైపు ప్రోత్సాహించింది. స్నేహితురాలి సలహా మేరకు పవిత్ర.. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరింది. ఆ తర్వాత బుల్లితెర మీద కనిపించాలనే ఉద్దేశంతో ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో తొలిసారి జొకాలి అనే కన్నడ సీరియల్లో ఆమెకు అవకాశం లభించింది. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో అవకాశాలు అందిపుచ్చుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ముందుగా నిన్నే పెళ్లాడతా సీరియల్‌లో నటించింది. ఆ సమయంలో తెలుగు రాక చాలా ఇబ్బంది పడ్డానని.. ఆతర్వాత నెమ్మదిగా అలవాటయ్యింది అని చెప్పుకొచ్చింది పవిత్ర. త్రినయని సీరియల్‌తో తెలుగులో ఆమె కెరీర్‌ మలుపు తిరిగిందని చెప్పవచ్చు.

ఇక వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని చెప్పుకొచ్చింది పవిత్ర. చాలా చిన్న వయసులోనే ఆమెకు వివాహం అయ్యిందట. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చించి. ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ.. ‘‘చాలా చిన్న వయసులోనే నాకు పెళ్లి అయ్యింది. వివాహం జరిగే నాటికి నా వయసు కేవలం 16 సంవత్సరాలు. వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. భర్తతో నిత్యం గొడవలు. భరించలేక విడాకులు తీసుకున్నాను. నాకు ఇద్దరు సంతాంన. కొడుకుకు ఇప్పుడు 22 ఏళ్లు, కుమార్తెకు 19 ఏళ్లు. వారి చిన్నతనంలోనే భర్త నుంచి విడిపోయాను. బిడ్డలను పెంచడం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. సీరియల్స్‌లోకి వచ్చాక ఆర్థిక కష్టాలైతే తొలగిపోయాయి’’ అని చెప్పుకొచ్చింది. పవిత్ర మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

Show comments