Swetha
జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీస్ కు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఓ సాలిడ్ అప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్ ను గర్వాంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అదేంటో చూసేద్దాం.
జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీస్ కు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్స్ వస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఓ సాలిడ్ అప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్ ను గర్వాంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. అదేంటో చూసేద్దాం.
Swetha
తారక్ ఎప్పుడు తన అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇప్పటివరకు అలానే చేసాడు కూడా. కానీ ఈసారి తీయబోయే సినిమాతో కాలర్ ఎగరేసుకునేలా చేయడంతో పాటు.. ప్రతి తారక్ అభిమాని గర్వంగా కూడా ఫీల్ అయ్యేలా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం తారక్ వార్ 2 , ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ , దేవర 2 మూవీలకు కమిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు అసలు విషయానికొస్తే తారక్ ఓ షాకింగ్ బయోపిక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే సినీ పితామహుడిగా ఇండస్ట్రీ కొలిచే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో తారక్ నటించబోతున్నారట. ఈ ప్రాజెక్ట్ వెనుక రాజమౌళి , కార్తికేయ , వరుణ్ గుప్తా హస్తం కూడా ఉందని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే తారక్ సినీ కెరీర్ లోనే ఈ మూవీ బెస్ట్ మూవీ అవుతుందని చెప్పి తీరాల్సిందే.
అసలు ఇప్పటివరకు దాదాసాహెబ్ ఫాల్కే గురించి ఎవరికీ అంతగా తెలీదు. ఇప్పుడు ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్ ను పిక్ చేసుకోవడంతో ఇది అందరిని ఆకర్షిస్తుంది. ఇక తారక్ విషయానికొస్తే ఇలాంటి రియల్ డ్రామాను తారక్ లాంటి కమర్షియల్ స్టార్ తో వర్క్ అవుట్ చేయించడం కాస్త కష్టమే అని పలువురు భావిస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం తారక్ ఏ రోల్ లో ఉన్నా సరే తారక్ కోసమైనా సినిమాను చూస్తారన్న మాట వాస్తవం. ఇక ఏమౌతుందో చూడాలి. మరోవైపు దాదా సాహెబ్ జీవితం విషయానికొస్తే.. దాదాసాహెబ్ ఫాల్కే జీవితం చాలా పెద్దది. ఆయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. 1870 లో పుట్టిన ఈయన.. భారతదేశపు మొదటి సినిమా రాజా హరిశ్చంద్రకు నిర్మాత కం దర్శకులు. ఇది 1913 లో రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత 1903లో ఆర్కియాలాజి డిపార్ట్ మెంట్ లో ఫోటోగ్రాఫర్ గా చేరిన తర్వాత ఇతని జీవితం మలుపు తిరిగింది. 1910లో లైఫ్ అఫ్ క్రీస్ట్ చిత్రం చూసిన తర్వాత.. అతను సినిమా తీయాలని నిర్ణయించుకోవడం మొత్తం దేశ తలరాతను మార్చింది.
ఆస్తులు అమ్మి డబ్బులు పోగేసి మరీ సినిమా తీయడానికి అవసరమైన పరికరాలు కొనేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఫాల్కే జీవితం చరిత్రలో ముఖ్యమైన అధ్యాయాలు చాలానే ఉన్నాయి. ఇంత గొప్ప మనిషి జీవితం ఆఖరి దశలో సొంత ఇల్లు , డబ్బు లేకుండా గడిచిపోయింది. ఇలాంటి అరుదైన వ్యక్తుల గురించి ఈ తరం వారు తెలుసుకోవడం చాలా అవసరం. మరి నిజంగా ఈ మూవీ కనుక కార్యరూపం దాల్చితే కచ్చితంగా ప్రపంచ సినిమా చరిత్రలో ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోతుందని చెప్పి తీరాలి. ఇది నిజం అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.