iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటి రేష్మాకు మళ్లీ పెళ్లి.. అసలు విషయం చెప్పేసింది!

ప్రముఖ నటి రేష్మాకు మళ్లీ పెళ్లి.. అసలు విషయం చెప్పేసింది!

ప్రముఖ కోలీవుడ్ నటి రేష్మా పసుపులేటి రెండో పెళ్లి చేసేసుకుందా ?.. మరీ, ఇంత సడెన్‌గా ఆమె పెళ్లి చేసుకోవటానికి కారణం ఏంటి? ఇప్పుడు రేష్మా పెళ్లి విషయమే కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన రేష్మా-నరేన్‌ల ఫొటోలు.. రేష్మా రెండో పెళ్లి వార్తలకు తెరతీశాయి. రేష్మా-నరేన్‌లు ఆ ఫొటోల్లో పెళ్లి బట్టల్లో ఉండటమే పుకార్లకు కారణమవుతోంది. ఇంతకీ సంగతేంటంటే.. కొద్దిరోజుల క్రితం నటి రేష్మా నటుడు నరేన్‌తో కలిసి దిగిన కొన్ని ఫొటోలను తన ఇస్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఇద్దరూ పెళ్లి బట్టల్లో ఉండటంతో ఆ ఫొటోలు కాస్తా వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు రావటం మొదలయ్యాయి. అభిమానులు సైతం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారా? అంటూ అడగటం మొదలుపెట్టారు. దీంతో రేష్మా ఈ రెండో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇవ్వక తప్పలేదు. ఈమేరకు ఆమె తాజాగా, తన ఇస్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చి అభిమానులకి ఓ క్లారిటీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ నేను పెళ్లి చేసుకోలేదు. అది నిజమైన పెళ్లి కాదు. అవి పెళ్లి మ్యాగజైన్‌ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు’’ అంటూ క్లారిటీ ఇచ్చారు. తర్వాత తన సినిమాల గురించి ఆమె చెప్పుకొచ్చారు. తను నటిస్తున్న ‘సతియ సోదనై’ సినిమా జులై 21న ప్రేక్షకుల ముందు రానుందని వెల్లడించారు.

ఆమె నటించిన మరో సినిమా ‘3:33’ అతి త్వరలో ఆహా తమిళ్‌లో స్ట్రీమింగ్‌ కానుందని తెలిపారు. తనకు మొదటినుంచి అండగా ఉంటున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, రేష్మా పసుపులేని తమిళ్‌ బిగ్ బాస్ 3తో మంచి పేరు తెచ్చుకున్నారు. 2009లో వచ్చిన ‘లవ్’ అనే తెలుగు సీరియల్‌తో ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2015లో ‘ మసాల పడం’ అనే సినిమాతో వెండి తెరపైకి అడుగుపెట్టారు. ‘వేలైను వందుట్ట వేలైకారన్‌’ సూపర్ హిట్ అందుకున్నారు. మరి, పెళ్లి వార్తలపై రేష్మా క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 ఇవి కూడా చదవండి : నీకసలు కృతజ్ఞతనేదే లేదు.. హీరో సూర్యపై ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌..