Ooru Peru Bhairavakona: స్ట్రాంగ్ రిపోర్ట్ అన్ని చోట్లా….ఊరిపేరు భైరవకోన

రోటిన్‌కి భిన్నంగా విభిన్నమైన కథతో వచ్చిన ఊరు పేరు భైరవకోన సినిమా.. సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది అంటున్నారు. ఆ వివరాలు..

రోటిన్‌కి భిన్నంగా విభిన్నమైన కథతో వచ్చిన ఊరు పేరు భైరవకోన సినిమా.. సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది అంటున్నారు. ఆ వివరాలు..

ప్రయోగాలు అన్నిసార్లూ సక్సెస్ కావు. అయినవి అక్కడక్కడ ప్రేక్షకులను బాగా రెచ్చగొడతాయి. దర్శకుడు అనుకుని, ఓ కన్విక్షన్‌తో గనక తీయగలిగితే అదిగో ఊరిపేరు భైరవకోన సినిమాలా చూస్తున్నంత సేపూ చాలా ఇంట్రస్టింగ్ గా ఆడియన్స్ ని అరెస్ట్ చేస్తుంది. నిన్న రిలీజ్ అయిన ఊరిపేరు భైరవకోన విడుదలైన అన్ని సెంటర్లలో స్ట్రాంగ్ రిపోర్ట్ సాధించింది. ఈ మధ్య రోజుల్లో సినిమాలకి ఓపెనింగ్సే ఉండట్లేదు. ఉన్నా అవి మేట్నీ షోకే ఢీలా పడిపోతున్నాయి. కానీ ఊరిపేరు.. మాత్రం మోర్నింగ్ షో నుంచి టేకాఫ్ అయి సెకండ్ షో వరకూ షో షోకి గేరప్పయింది.

నిర్మాతలు అనిల్ సుంకర, దండా రాజేష్ ఇద్దరి సాహసం బాగా పే చేసింది. అవును నిజమే ఊరిపేరు….సినిమా నిజంగానే ఓ సాహసం. ఎందుకంటే ఆ కంటెంట్ అటువంటిది. ఎప్పుడో మనం కాశీమజిలీ కథలలోనో, పేదరాశి పెద్దమ్మ కథలలోనో తప్ప ఇటువంటి కథలని, కథానాలని, పాత్రలని, అందులోని విచిత్రమైన సంఘటనలని ఎప్పుడూ చూడలేం. అఫ్ కోర్స్….రాజకుమారులు దేవకన్యలను ప్రేమించి, పెళ్ళి చేసుకుని భూలోకంలోకి తీసుకొచ్చిన జగదేకవీరుడి కథలాంటి సినిమాలు బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టి, ల్యాండ్ మార్క్ సినిమాలు గా నిలిచిపోవడం మనకి తెలుసు.

ఊరిపేరు భైరవకోన సినిమా దానికి రివర్స్. దేవకన్యలకి, రాక్షసులకి, మాయారూపలకి బదులుగా ఇందులో దర్శకుడు విఐ ఆనంద్ దెయ్యాల పాత్రలని రాసుకున్నాడు. వాటి మధ్య గొడవలు, విభేదాలు, విద్వేషాలు, ప్రేమలు, విడిపోవడాలు….ఇలా డిఫరెంట్ ప్లెయిన్లో కథ మొత్తం చెప్పాడు. గొప్పగా చెప్పాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా, ఓ కన్విక్షన్ బేస్ ని క్రియేట్ చేసి చాలా ఆసక్తిగా తీశాడు. ఆనంద్ రాసిన కథని నిర్మాతలు అనిల్ సుంకర, దండా రాజేష్ కూడా బాగా నమ్మి, బాగా ఖర్చు పెట్టి మరీ తీశారు.ఫలితాన్ని సాధించారు. మంచి రిజల్టునే కొట్టేశారు.

ఇటువంటి కథలు ఈ మధ్య బాగా ఆడుతున్నాయి. కరెక్టుగా పే చేస్తున్నాయి. విరూపాక్ష నుంచి తీసుకుంటే, పొలిమేర 2 లాంటి సినిమాలు నిర్మాతలకి మంచి లాభాలనే తెచ్చిపెట్టాయి. ఆడియన్స్ రొటీన్ సినిమాలను తిప్పికొడుతున్న టైంలో ఇటువంటి పూర్తి విభిన్నమైన కథలకే పట్టాభిషేకం జరుగుతోంది. మారుతున్న ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టుగా ఆనంద్ తీసిన ఊరిపేరు భైరవకోన కూడా యేటర్స్ ని స్టన్ చేసింది. అమితమైన ఖర్చుతో కూడుకున్న గ్రాఫిక్స్ తో పాటుగా, సందీప్ కిషన్ సాలిడ్ పెరఫారమెన్స్, హీరోయన్ల ప్రజెంటేషన్ అన్నీ కలగలిపి సినిమా ఎండ్ టు ఎండ్ అరెస్ట్ చేసేసింది. కాంపిటేషన్ ఉన్నా నిలబడగలిగే ఇటువంటి సినిమాకి కాంప్టీషన్ కూడా లేకపోవడం పెద్ద ప్లస్ అయింది.

Show comments