Niveda Thomas News Movie- 35 Chinna Katha kaadu: వీడియో: నివేదా థామస్ కొత్త మూవీ.. చిన్న కథ కాదు ఇది!

వీడియో: నివేదా థామస్ కొత్త మూవీ.. చిన్న కథ కాదు ఇది!

Niveda Thomas New Movie 35 Chinna Katha Kadu Teaser Review: నివేదా థామస్ కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. మరి.. ఆ మూవీ టీజర్ ఎలా ఉంది? అసలు ఆ కథ ఏంటో చూద్దాం.

Niveda Thomas New Movie 35 Chinna Katha Kadu Teaser Review: నివేదా థామస్ కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. మరి.. ఆ మూవీ టీజర్ ఎలా ఉంది? అసలు ఆ కథ ఏంటో చూద్దాం.

నివేదా థామస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు ఏమీ అక్కర్లేదు. ఈమె ఇప్పటికే తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. కానీ, కెరీర్ లో మాత్రం కాస్త గ్యాప్ తీసుకున్నట్లు కనిపించింది. కానీ, ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు.. అలరించేందుకు వచ్చేస్తోంది. అది కూడా అలాంటి ఇలాంటి కథతో కాదండోయ్. ఇప్పుడు రాబోతోంది చిన్న కథ అయితే కాదనే చెప్పాలి. పైగా ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా కూడా అనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ చూసిన తర్వాత కచ్చితంగా ఇందులో ఏదో మంచి పాయింట్ ఉంది అని మీకు కూడా అనిపిస్తుంది.

సాధారణంగా కొన్ని సినిమాలు కేవలం ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ లోనే వస్తాయి. కానీ, కొన్ని మాత్రం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంటాయి. ఈ సినిమా కూడా ఆ కోవకు చెందిందే. ఎందుకంటే తల్లిదండ్రులు అంతా పొద్దున్నే లేచి పిల్లలను రెడీ చేసి స్కూల్ కి పంపుతున్నారు. గంపెడు పుస్తకాలు, వాటినిండా హోమ్ వర్క్ లు చేస్తూ.. చేయిస్తూ పిల్లల బాల్యాన్ని ఒక గానుగ చుట్టూ తిరిగేలా మార్చేస్తున్నారు. అయితే ఆ పిల్లాడు బట్టీ పడుతున్నాడా? నేర్చుకుంటున్నాడా? అనే ప్రశ్న అడగడమే మానేశారు. ఇంక స్కూల్లో టీచర్లు ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేస్తే అస్సలు ఊరుకోరు. ఈ మూవీలో లెక్కలు మాస్టారిలా? ఉన్నది చదువు.. చెప్పింది రాయి అనే ధోరణే ఎక్కువ కనిపిస్తోంది.

ఇప్పుడు ఈ సినిమా అచ్చం ఇదే పాయింట్ మీద తీసినట్లు ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. అందుకు అదనంగా ఒక తల్లి ప్రేమ, ఆమె బాధ, పిల్లాడు నేర్చుకోవాలి అని ఆమె పడే తపన ఎంతో ముచ్చటగా అనిపిస్తున్నాయి. పదో తరగతి ఫెయిల్ అయిన ఆ తల్లి అడిగిన ప్రశ్నకు ఒక లెక్కలు మాస్టారు కూడా సమాధానం చెప్పలేకపోవడం ఆకట్టుకునేలా ఉంది. పిల్లలు తప్పు చేస్తే ఇప్పటికీ తల్లినే తిడుతున్నారు. అయితే ఆ పిల్లాడు ఆ తప్పు ఎందుకు చేశాడు? అసలు ఒక పిల్లాడు ఫెయిల్ అయితే చదువు అని చెప్తున్నారే గానీ.. ఎందుకు ఫెయిల్ అయ్యాడు అనే ప్రశ్న మాత్రం ఏ టీచర్ అడగటం లేదు.. ఏ తల్లిదండ్రులు కూడా.

ఇలాంటి అన్నీ పాయింట్స్ మీద ఈ సినిమా రాబోతోంది అని అర్థమైపోయింది. కేవలం 35 మార్కులు కూడా తెచ్చుకోలేని ఒక పిల్లాడు.. ఇంటిని వదిలి పారిపోయాడు. అతను మళ్లీ తిరిగి ఆ తల్లి దగ్గరకు చేరాడా? ఒకవేళ చేరితే మరి ఆ 35 మార్కులను తెచ్చుకోగలిగాడా? అనే ప్రశ్నల మీద ఈ కథ సాగబోతోందని తెలుస్తోంది. ఇంక ఈ పాత్రలో నివేదా థామస్ ఎంతో చక్కగా ఒదిగిపోయింది. ఈ 35 చిన్న కథ కాదు మూవీ రానా దగ్గుబాటి సమర్పణలో.. నంద కిశోర్ ఈమని డైరెక్షన్లో వస్తోంది. ఈ మూవీని తెలుగు, తమిళ్, మలయాళంలో వస్తోంది. ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. మరి.. టీజర్ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments