Nani Revealed a Song From Saripodhaa Sanivaaram Movie: సరిపోదా శనివారంలో తన ఫేవరెట్ పాట ఏంటో చెప్పేసిన నాని!

సరిపోదా శనివారంలో తన ఫేవరెట్ పాట ఏంటో చెప్పేసిన నాని!

Nani Revealed a Song From Saripodhaa Sanivaaram Movie: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అయ్యే సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ కి.. స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని తన తాజా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో నాని సరిపోదా శనివారం మూవీ నుంచి తనకు ఇష్టమైన సాంగ్ ఏంటో చెప్పేశారు.

Nani Revealed a Song From Saripodhaa Sanivaaram Movie: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అయ్యే సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ కి.. స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని తన తాజా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో నాని సరిపోదా శనివారం మూవీ నుంచి తనకు ఇష్టమైన సాంగ్ ఏంటో చెప్పేశారు.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అయ్యే సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ కి ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పుడప్పుడు సెలెబ్రెటీస్ కూడా ఈ షోకి వచ్చి సందడి చేస్తుంటారు. తమ సినిమాలని ప్రమోట్ చేస్తూ సరదా సరదాగా షోని ఆసక్తిగా ముందుకు నడిపిస్తుంటారు. ప్రస్తుతం సీజన్ 3 నడుస్తుంది. ఇక తాజాగా స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని తన తాజా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 18, 19వ ఎపిసోడ్ లలో పాల్గొని ఆయన సందడి చేయడం జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేసింది ఆహా. ఈ షోలో ట్యాలెంటెడ్ సింగర్స్ మధ్య పోటీని చూస్తూ నాని బాగా ఎంజాయ్ చేసాడు.

ఇదిలా ఉంటె ఈ వేదిక మీద తన సరిపోదా శనివారం సినిమాలో తనకు ఇష్టమైన సాంగ్ ఏంటో చెప్పేశారు. అయితే ఈ సాంగ్ ఇంకా రిలీజ్ కాలేదు. కానీ నాని స్టేజ్ పైన లీక్ చేసేశారు. ఇంకా విడుదల చేయని ”అనుకుందే జరిగిందా ” అనే పాటను రివీల్ చేశారు. అంతేగాక స్టార్ సింగర్ కార్తీక్‌తో కలిసి ఈ పాట పాడారు. కేవలం పాట పాడటమే కాకుండా తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో కూడా అలరించాడు నాని. ఆయన లీక్ చేసిన ఈ స్పెషల్ సర్ ప్రైజ్ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.ఇలా తనకి ఇష్టమైన పాటని రివీల్ చేసిన నాని సినిమా గురించి పలు ఆసక్తికరమైన వివరాలను పంచుకున్నాడు. వివేక్ ఆత్రేయ చెప్పిన కథ వినగానే చాలా బాగా నచ్చిందని ఇది అందరికి కనెక్ట్ అయ్యే కథ తప్పకుండా ఆడియన్స్ కు నచ్చుతుందని అన్నారు.

ఇక ఈ సినిమాకి జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. తమిళ పాపులర్ హీరోయిన్ ప్రియాంక మోహన్ నాని సరసన నటించింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ హీరో ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్ గా నటించారు. సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళి శర్మ, అజయ్, అజయ్ ఘోష్, శివాజీ రాజా , హర్షవర్ధన్ , అభిరామి తదితరులు ఈ సినిమాలో నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా. పాన్ ఇండియా లెవెల్ లో ఆగష్టు 29 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఎన్నో భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఈ సినిమా నానికి ఎలాంటి హిట్ ని ఇస్తుందో చూడాలి. మరి ఈ చిత్రం ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments