Venkateswarlu
తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ అంత్యక్రియలు జనంతో పాటు పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు హాజరయ్యారు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్‌లు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ అంత్యక్రియలు జనంతో పాటు పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు హాజరయ్యారు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్‌లు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
Venkateswarlu
తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ గురువారం కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు బుధవారం కరోనా పరీక్షలు చేయించారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారమే ఆస్పత్రిలో చేరారు. కరోనాకు చికిత్స తీసుకుంటూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. విజయ్‌కాంత్ మరణ వార్తతో తమిళనాడు శోక సంద్రంలో మునిగిపోయింది.
సినీ పరిశ్రమతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక, శుక్రవారం విజయ్‌కాంత్ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలకు ముందు ఆయన భౌతిక దేహాన్ని అభిమానులతో పాటు సెలెబ్రిటీ సందర్శనార్థం ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు ఈ అంత్యక్రయల్లో పాల్గొన్నారు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్‌లు విజయ్‌కాంత్ భౌతికి దేహానికి నివాళులు అర్పించారు. విజయ్ నివాళులు అర్పిస్తున్న సమయంలో చేదు అనుభవం ఎదురైంది.
విజయ్‌కాంత్‌కు విజయ్ నివాళులు అర్పిస్తుండగా ఓ వ్యక్తి ఆయనపై చెప్పు విసిరివేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ ఫ్యాన్స్ చెప్పు విసిరిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజిత్ ఫ్యాన్స్ కూడా ఈ చర్యను తప్పుబడుతున్నారు. కాగా, విజయ్‌కాంత్‌కు 1970లలో సినీ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆయన నల్లగా ఉన్నాడంటూ మొదట్లో చాలా మంది అవకాశాలు ఇవ్వలేదు. కానీ, ఆయన మాత్రం సినిమా మీద ఇష్టంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎదుగుతూ పైకి వచ్చారు.
ఒకే సంవత్సరం 18 సినిమాలు చేసేంత స్టార్‌డమ్, క్రేజ్ సంపాదించుకున్నారు. అప్పటి స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్‌లకు పోటీగా మారారు. విజయ్‌కాంత్ నటించిన సినిమాలు తెలుగుతో పాటు హిందీలోనూ డబ్ అయ్యేవి ఇక్కడ కూడా హిట్ అవుతూ వచ్చాయి. సినిమాల్లో స్టార్‌గా వెలుగొందుతున్న సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. డీఎమ్ డీకే పార్టీని స్థాపించారు. మొదటి సారి ఎన్నికలకు వెళ్లినపుడు కేవలం ఒకసీటు మాత్రమే గెలుచుకున్నారు.
తర్వాత ఏఐఎమ్‌డీకే పార్టీతో పొత్తు పెట్టుకుని 23 సీట్లను సాధించారు. తర్వాత అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోయారు. గతంలో ఓ సారి కరోనా బారినపడ్డారు. అప్పుడు ఆరోగ్యంగానే బయటపడ్డారు. ఈ సారి మాత్రం కరోనా నుంచి కోలుకోలేక మృతి చెందారు. మరి, విజయ్‌కాంత్ అంత్యక్రియల సందర్భంగా విజయ్‌పై చెప్పు విసరటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
We #Ajith fans strongly condemneding this disrespect behaviour to vijay . whoever it may be, we should respect when they came to our place.
Throwing slipper to @actorvijay is totally not acceptable 👎🏻
Stay strong #Vijay #RIPCaptainVijayakanth pic.twitter.com/dVg9RjC7Yy
— AK (@iam_K_A) December 29, 2023