ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదాల పరంపరం కొనసాగుతోంది. బుధవారం ప్రముఖ బాలీవుడ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌ నితిన్‌ దేశాయ్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాదాపు 225 కోట్ల అప్పుల భారంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమలో సీనియర్‌ నటుడు మోహన్‌ రోడ్డు పక్క దయనీయ స్థితిలో శవమై తేలాడు. ఇక, కన్నడ నాట సీనియర్‌ రంగ స్థల, సినిమా నటి మమత గూడర అనారోగ్యం కారణంగా చనిపోయారు. మెదడులో రక్త స్రావం అవ్వటంతో మంచానికి పరిమితం అయిన ఆమె గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు.

ఈ విషాదాలు మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ సీనియర్‌ నటుడు కైలాస్‌ నాథ్‌ చనిపోయారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తుది శ్వాస విడిచారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కైలాస్‌ గత కొంత కాలంగా లివర్‌ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఆయన లివర్‌లో కొవ్వు చేరటంతో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆయన ఆస్పత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అయితే, గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది.

వైద్యుల ప్రయత్నాలు విఫలమై ఆయన కన్నుమూశారు. కైలాస్‌ నాథ్‌ మరణాన్ని ప్రముఖ నటి సీమా నాయర్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ధ్రువీకరించింది. కాగా, కైలాస్‌ 1999లో వచ్చిన ‘సంఘమ్‌’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘ఒరు తలై రాగమ్‌’ సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్నారు. యుగపురుషన్‌, ఎదో ఒరు స్వప్నమ్‌, తమ సోమ జ్యోతిర్గమయ వంటి హిట్టు సినిమాల్లో నటించారు. కైలాస్‌ మృతిపై పలువురు మలయాళ సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

Show comments