Arjun Suravaram
KK Senthil Kumar: ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ ఇంట విషాదం చోటుచేసుకుంది. దర్శకు ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలకు సెంథిల్ కుమార్ సినిమాటో గ్రాఫర్ గా పని చేశాడు. గురువారం ఆయన ఇంట విషాదం నెలకొంది.
KK Senthil Kumar: ప్రముఖ సినిమాటో గ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ ఇంట విషాదం చోటుచేసుకుంది. దర్శకు ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలకు సెంథిల్ కుమార్ సినిమాటో గ్రాఫర్ గా పని చేశాడు. గురువారం ఆయన ఇంట విషాదం నెలకొంది.
Arjun Suravaram
ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పలువురు ప్రముఖులు వివిధ కారణాలతో తిరిగి రానిలోకానికి తరలి వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, అనారోగ్య సమస్య, ఆత్మహత్య ఇలా వివిధ కారణాలతో ప్రముఖులు మరణిస్తున్నారు. వీరి మరణంతో కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. ఇటీవలే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇంట విషాదం నెలకొంది.
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో సినిమాటో గ్రాఫర్ గా పనిచేసి మంచి గుర్తింపు పొందారు. ఇది ఇలా ఉంటే సెంథిల్ కుమార్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూహీ కాసేపటి క్రితమే కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల నుంచి రుచి ఆరోగ్యం బాగా క్షీణించి పరిస్థితి చేజారిపోయింది. శ్వాస తీసుకునేందుకు బాగా ఇబ్బంది పడింది. గురువారం రుచి ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు.
రూహీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో సెంథిల్ కుమార్ గత కొన్ని రోజులుగా పనికి దూరంగా ఉంటూ భార్యను చూసుకుంటున్నాడు. సెంథిల్ మరియు రుచి 2009లో వివాహం చేసుకున్నారు మరియు ఆమె వృత్తి రీత్యా యోగా శిక్షకురాలిగా పనిచేస్తున్నారు. రూహీ మరణంతో సెంథిల్ కుటుంబం షాక్‌కు గురైంది. సెంథిల్ కుమార్ కుటుంబానికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఐతే సినిమాతో సెంథిల్ కుమార్ సినీ కెరీర్ ప్రారంభమైంది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సై, ఛత్రపతి, అశోక్, అరుంధతి, యమదొంగ, ఈగ, బాహుబలిస, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలకు సెంథిల్ పని చేశారు. దాదాపు రాజమౌళి అన్ని చిత్రాలకు సినిమాటో గ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ పని చేశారు.