Swetha
మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప థియేటర్స్ లో డీసెంట్ టాక్ సంపాదించుకుంటుంది. ప్రభాస్ ప్లాట్ , క్లైమాక్స్ కోసమైనా సినిమా థియేటర్స్ లో చూడాల్సిందే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ మీద ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆల్రెడీ గతంలో ఓసారి కన్నప్ప ఓటిటి గురించి డిస్కషన్స్ జరిగాయి

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప థియేటర్స్ లో డీసెంట్ టాక్ సంపాదించుకుంటుంది. ప్రభాస్ ప్లాట్ , క్లైమాక్స్ కోసమైనా సినిమా థియేటర్స్ లో చూడాల్సిందే అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ మీద ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆల్రెడీ గతంలో ఓసారి కన్నప్ప ఓటిటి గురించి డిస్కషన్స్ జరిగాయి. సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఓటిటి డీల్ క్లోజ్ చేసే ప్రసక్తి లేదని విష్ణు చెప్పేశారు. ఇక ఇప్పుడు మూవీ రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ అందుకోవడంతో ఓటిటి టాక్స్ వినిపిస్తున్నాయి.
ఈ సినిమా ఓటిటి రైట్స్ కోసం ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో , నెట్ ఫ్లిక్స్ పోటీపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే సాధారణంగా థియేటర్ లో రిలీజ్ అయిన ఏ సినిమా అయినా మూడు నుంచి నాలుగు వారాలా వ్యవధిలో ఓటిటి లోకి వచ్చేస్తుంది. కానీ విష్ణు మాత్రం కన్నప్పను పది వారలా వరకు ఓటిటి కి వదిలేది లేదని తేల్చి చెప్పేశాడు. సో ఇప్పట్లో సినిమా ఓటిటి లోకి వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ ఒక వారం తర్వాత కలెక్షన్స్ ను బేస్ చేసుకుని నిర్ణయం మార్చుకుంటారేమో చూడాలి.
సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, సినిమాలో స్టార్ హీరోలు ఉండడంతో మంచు విష్ణు ఓటిటి రైట్స్ కోసం భారీ ధరనే డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్ బాబు ఈ మూవీ నిర్మించారు. సినిమా మీద దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారనే టాక్ వినిపిస్తుంది. సో ఇక రికవరీ ఏ రేంజ్ లో ఉంటుంది చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.