Deepika Padukone: ‘కల్కి 2898 AD’ కోసం దీపికకు కళ్లుచెదిరే రెమ్యూనరేషన్.. కెరీర్​లో ఇదే హయ్యెస్ట్!

స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పాన్ వరల్డ్ రేంజ్​లో రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్​గా నటిస్తున్నారు దీపికా పదుకోణ్.

స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. పాన్ వరల్డ్ రేంజ్​లో రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్​గా నటిస్తున్నారు దీపికా పదుకోణ్.

ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలదే హవా. చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేదు, ఏ భాషకు చెందినది, ఎవరు నటించారనే పట్టింపులు లేవు. మూవీ బాగుందా.. మల్టిపుల్ లాంగ్వేజెస్​లో రిలీజ్ చేసేయడమే. కాన్సెప్ట్ బాగుండి, అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంటే ప్రాజెక్ట్ మొదలుపెట్టేటప్పుడే బహు భాషల్లో నిర్మించడం కూడా ఇప్పుడు ట్రెండ్​గా మారింది. అయితే దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ భారతీయ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్​కు పరిచయం చేసేందుకు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రయత్నిస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’ ఫిల్మ్​తో పాన్ వరల్డ్ ప్రేక్షకుల్ని పలకరించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ స్టార్ దీపికా పదుకోణ్ హీరోయిన్​గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం ఆమెకు కళ్లుచెదిరే రీతిలో పారితోషికం అందినట్లు తెలుస్తోంది.

సైంటిఫిక్ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్​గా రూపొందుతున్న ‘కల్కి 2898 ఏడీ’లో దీపికతో పాటు విశ్వనటుడు కమల్ హాసన్, బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, క్యూట్ హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ‘కల్కి’లో యాక్ట్ చేసినందుకు గానూ దీపికకు ఏకంగా రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ అప్పజెప్పారని ఫిల్మ్​నగర్ టాక్. ఆమె కెరీర్​లో ఇంత భారీ పారితోషికం అందుకోవడం ఇదే మొదటిసారి అని సమాచారం. గతంలో ఒక్కో చిత్రానికి రూ.12 నుంచి రూ.15 కోట్ల వరకు దీపిక రెమ్యూరనేషన్ తీసుకునేవారట. అయితే చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ‘కల్కి’ కోసం భారీగా కాల్షీట్లు కేటాయించాల్సి రావడంతో ఆమె రూ.20 కోట్లు డిమాండ్ చేశారట. కీలక పాత్ర కావడం, నార్త్​లో ఆమెకు భారీ మార్కెట్ ఉండటంతో నిర్మాతలు కూడా ఈ డిమాండ్​కు ఓకే చెప్పారని బాలీవుడ్​లో టాక్ నడుస్తోంది.

ఇక, వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ చిత్రాల నిర్మాత సీ అశ్వినీదత్ ‘కల్కి 2898 ఏడీ’ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఈ ఫిల్మ్​ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. వరల్డ్ వైడ్​గా సుమారుగా 22 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అందులో ఇంగ్లీష్​ కూడా ఉంది. హాలీవుడ్ స్టాండర్డ్స్​లో రూపొందుతున్న ఈ ఫిల్మ్​ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందోనని అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు. విడుదలకు మరో మూడ్నెలల సమయం ఉండటంతో సినిమాకు సంబంధించిన బిజినెస్​ను ఇప్పటికే వైజయంతీ మూవీస్ సంస్థ స్టార్ట్ చేసిందని తెలిసింది. ఓవర్సీస్ రైట్స్​ కోసం రూ.100 కోట్ల రేట్​ను ఫిక్స్ చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ ఆ ధరకు సినిమా అమ్ముడుపోతే మాత్రం భారతీయ చిత్ర పరిశ్రమలో పెను సంచలనంగా నిలుస్తుందని చెప్పొచ్చు. మరి.. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మమ్ముట్టి ప్రయోగం భ్రమయుగం.. టైటిల్ కి తగ్గట్లే ట్రైలర్ లో కూడా..!

Show comments