The Goat Movie: దళపతి ‘ది గోట్’ మూవీలో ధోని కాదు.. సుబ్రమణ్యం బద్రీనాథ్!

Subramaniam Badrinath, Thalapathy Vijay, The Goat Movie: దళపతి విజయ్ నటించిన ది గోట్ మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఓ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.

Subramaniam Badrinath, Thalapathy Vijay, The Goat Movie: దళపతి విజయ్ నటించిన ది గోట్ మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఓ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ట్వీట్ చేశాడు.

దళపతి విజయ్-వెంకట్ ప్రభు కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మూవీ ‘ది గోట్'(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ ఈ సినిమాలో నటించాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు.

‘ది గోట్’.. దళపతి విజయ్ నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. వెంకట్ ప్రభు టేకింగ్, విజయ్ యాక్టింగ్ కు ఫ్యాన్స్ ఫిదా కావడం పక్కా అని ప్రచార చిత్రాలు చూస్తేనే తెలుస్తుంది. ఇక ఈ మూవీలో విజయ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. దాంతో మూవీపై ఇంకాస్త అంచానాలు పెరిగిపోయాయి. అదీకాక ది గోట్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని నటిస్తున్నాడనే వార్త వైరల్ గా మారింది. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలీదు కానీ.. ఓ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాత్రం ది గోట్ లో నటించానని వెల్లడించాడు. అతడెవరో కాదు.. సుబ్రమణ్యం బద్రీనాథ్.

సుబ్రమణ్యం బద్రీనాథ్.. టీమిండియాతో పాటుగా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో ఇతడికి జట్టులో స్థానం కరువైంది. అయితే క్యాష్ రిచ్ లీగ్ లో చెన్నై తరఫున ఎక్కువ మ్యాచ్ లు ఆడి, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా అతడు చేసిన ట్విట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దళపతి విజయ్ ది గోట్ మూవీలో నటించానని తన పార్ట్ కు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశానని, తొలిసారి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉందని రివ్యూల కోసం ఎదురుచూస్తున్నాని బద్రీనాథ్ ట్వీట్ చేశాడు. కాగా.. కొన్ని రోజుల క్రితం ధోని కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. మరి సీఎస్కే మాజీ ప్లేయర్ ది గోట్ మూవీలో నటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments