iDreamPost
iDreamPost
రేపు విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ థియేటర్లు బ్యానర్లే కాదు ముళ్ళూ, మేకులు, కంచెలు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇద్దరు హీరోల మల్టీ స్టారర్ అందులోనూ కొణిదెల నందమూరి కాంబినేషన్ కావడంతో అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమని గుర్తించిన యాజమాన్యాలు దానికి తగ్గట్టే స్క్రీన్ దగ్గర కంచెలు, మేకుల షీట్లు పెడుతున్నాయి. ఎవరైనా అత్యుత్సాహంతో తెరవద్దకు వెళ్లి డాన్స్ చేయాలన్నా, గుంపుగా వెళ్లి అక్కడ గొడవ చేయాలన్నా సాధ్యం కాదన్న మాట. ఈ మధ్యే ఓ హాలులో భీమ్లా నాయక్ ప్రదర్శిస్తున్న టైంలో కొందరు హారతులు ఇవ్వడం, స్క్రీన్ కు దగ్గరగా వెళ్లి మితిమీరి ప్రవర్తించడం జరిగాయి.
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయవాడ అన్నపూర్ణ థియేటర్ లో ఇలాంటి సెట్టింగ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లోనూ ఇదే తరహా ట్రెండ్ కనిపిస్తోంది. లక్షలు విలువ చేసే తెరలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాలిపోతాయని అందుకే తప్పనిసరి పరిస్థితిలో ఫ్యాన్స్ ని కట్టడి చేయాల్సి వస్తోందని ఓనర్లు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలోనే విపరీత ధోరణి ప్రదరిస్తున్న అభిమానులు నేరుగా తలపడినప్పుడు ఇలాంటి పరిణామాలు ఆశించడం సహజమే. చాలా థియేటర్లు అత్యాధునిక వసతులతో ఉన్న కారణంగా ఈ జాగ్రత్త తప్పదు.
ఇటీవలే బెజవాడ అన్నపూర్ణ హాలులోని స్క్రీన్ ని క్లారస్ ఎక్స్సి 290 టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేశారు. అత్యద్భుతమైన క్వాలిటీతో ఇది విజువల్స్ ని ప్రెజెంట్ చేస్తుంది. చిన్న పుల్ల విసిరినా చాలు ప్రమాదానికి లోనయ్యేంత సున్నితంగా ఉంటుంది. అందుకే ముళ్ల పలకలు వేశామని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లలో ఆర్ఆర్ఆర్ నే వేస్తున్నారు. హౌస్ ఫుల్ బోర్డుతో ఆల్రెడీ ఆన్ లైన్ బుకింగ్స్ మంచి జోరుమీదున్నాయి.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం వారం పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ గ్రాండియర్ కి కీరవాణి సంగీతం, సాయిమాధవ్ బుర్ర మాటలు సమకూర్చారు
Also Read : RRR Premiers : చెప్పిన టైం కంటే ముందే ట్రిపులార్ రచ్చ ?