ఆత్మ విశ్వాసం అంటే ఇది.. చెయ్యి తెగిపోయినా సినిమా పూర్తి చేశాడు!

కానీ, కొంతమంది తమ లోపాల్ని.. అనుకూలతగా మార్చుకుని ముందుకు సాగుతుంటారు. దేన్నీ లెక్కచేయకుండా ముందుకు వెళుతుంటారు.

కానీ, కొంతమంది తమ లోపాల్ని.. అనుకూలతగా మార్చుకుని ముందుకు సాగుతుంటారు. దేన్నీ లెక్కచేయకుండా ముందుకు వెళుతుంటారు.

“ఎముకలు కుళ్ళిన, వయసు మళ్ళిన సోమరులారా చావండి… నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా రారండి” అన్నాడు మహాకవి శ్రీశ్రీ.. అన్నీ ఉన్నా ఏదో లేదన్న కారణంతో చేయాల్సిన పనుల్ని వాయిదా వేస్తుంటారు కొందరు. గొప్పగొప్ప కలలు కంటూ.. వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చేయరు. చిన్న చిన్న కారణాలకే పనులు వాయిదా వేస్తుంటారు. కానీ, కొంతమంది తమ లోపాల్ని.. అనుకూలతగా మార్చుకుని ముందుకు సాగుతుంటారు. దేన్నీ లెక్కచేయకుండా ముందుకు వెళుతుంటారు.

ప్రముఖ దర్శకుడు సెబాస్టియన్‌ నోవా అకోస్టా  ఒకరు. ఆయన ‘నరకాసుర’ అనే సినిమా తెరకెక్కుస్తున్న సమయంలో రైలు ప్రమాదం జరిగి కుడి చెయ్యి తెగిపోయింది. సాధారణంగా ఎవరైనా అయితే.. తమ వల్ల కాదని సినిమాను వదిలేస్తారు. కానీ, సెబాస్టియన్‌ మాత్రం చెయ్యి తెగిన 27వ రోజునే షూటింగ్‌లో పాల్గొన్నారు. సినిమాను పూర్తి చేశారు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘ ‘‘ నేను చిన్నతనంలో తప్పిపోతే ట్రాన్స్‌జెండర్స్‌ నన్ను మా కుటుంబంతో కలిపారు. నా నిజ జీవితంలో జరిగిన సంఘనతోనే ఈ కథ రాశాను. ‘నరకాసుర’ షూటింగ్‌ టైంలో ఒరిస్సా నుంచి జబల్‌పూర్‌ వెళుతుండగా ప్రమాదం జరిగింది. నా చెయ్యి తెగిపోయింది. అయినా కూడా 27వ రోజు షూటింగ్‌ వెళ్లా.. ఆత్మ విశ్వాసంతో సినిమా పూర్తి చేశాను’’ అని చెప్పుకొచ్చారు. మరి, చెయ్యి తెగిపోయినా ఒంటి చేత్తోనే షూటింగ్‌ కంప్లీట్‌ చేసి అందరికీ స్పూర్తిగా నిలుస్తున్న దర్శకుడు సెబాస్టియన్‌ నోవాపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments