అనిరుధ్ ను తెగ పొగిడేస్తున్న ఆడియన్స్.. గుడి కట్టిన తక్కువే అంటూ..

Anirudh : దేవర సినిమా ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోటా చూసినా బజ్ నడుస్తుంది. సరే సినిమా బావుంది నిజమే.. కానీ బావుండడం వెనుక కారణం దర్శకుని కథ మాత్రమే కాదు. సంగీత దర్శకుడు టాలెంట్ కూడా.. బక్కోడా నీకు గుడి కట్టిన తప్పులేదు అంటున్నారు.

Anirudh : దేవర సినిమా ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోటా చూసినా బజ్ నడుస్తుంది. సరే సినిమా బావుంది నిజమే.. కానీ బావుండడం వెనుక కారణం దర్శకుని కథ మాత్రమే కాదు. సంగీత దర్శకుడు టాలెంట్ కూడా.. బక్కోడా నీకు గుడి కట్టిన తప్పులేదు అంటున్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు నుంచి.. ఇంకా తగ్గేదె లే అనే రోజు వరకు వచ్చేసింది. దేవర సినిమా థియేటర్స్ లో దంచి కొడుతోంది. తెలుగులోనే కాదు.. తమిళం , మలయాళం , కన్నడ , హిందీ ఎక్కడ చూసిన దేవర గురించి పాజిటివ్ టాక్ ఏ వస్తుంది. ఎవరి నోట చూసిన దేవర హిట్ పక్కా అనే మాటే. యంగ్ టైగర్ వసూళ్లను వేటాడే పనిలో ఉన్నాడు. వెయ్యి కోట్లు పక్కా.. అందులో డౌట్ లేదు. మాస్ కాదు ఊర మాస్ జాతర జరుపుకుంటున్నారు అభిమానులు. నిజమే సినిమా సూపర్ హిట్.. ఎన్టీఆర్ చితక్కొట్టేశాడు.. ఫ్యాన్స్ కోరుకున్న మాస్ ఎలిమెంట్స్ ను దేవరలో చూపించాడు. కానీ సినిమా బావుండడం వెనుక కేవలం ఎన్టీఆర్ పాత్ర మాత్రమే లేదు . దర్శకుని కథ.. సంగీత దర్శకుని క్రియేటివిటీ కూడా ఉంది. మీడియా సోషల్ మీడియాలో అనిరుధ్ ను తెగ ప్రశంసిస్తున్నారు.

ఎంతైనా అనిరుధ్ కు తమిళ సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ తెలుగు సినిమాలపై లేదు. కోట్లలో పారితోషకం తీసుకుంటాడు కానీ సరైన న్యాయం చెయ్యట్లేదు. తెలుగు ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోతున్నాడు అనిరుధ్. దేవర ట్రైలర్ లో కూడా బిజియం బాగానే ఉన్నా టాప్ రేంజ్ లో అయితే లేదు. ఇవన్నీ మ్యూజిక్ డైరెక్ట్ అనిరుధ్ పై నెటిజన్లు కురిపించిన కామెంట్స్. కానీ అదంతా ఒక్కప్పుడు.. ఒక్కసారి దేవర బొమ్మ థియేటర్స్ పడ్డాక.. అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక్కొక్కరి బ్లడ్ బొయిల్ అయింది. బక్కోడా అలా కొట్టేశావ్ ఏంట్రా.. ఏం తాగి ఆ బిజిఎమ్ కొట్టావ్ మావా.. నీకు గుడి కట్టినా తప్పులేదు… ఒక్కొక్క బీజీఎమ్ లోపలికి ఇంజెక్ట్ అవుతుంది. ఇవన్నీ దేవర చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్న మాటలు. అందులో వాస్తవం లేకపోలేదు. థియేటర్స్ లో అనిరుధ్ మాస్ మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కు ఒక్కొక్కరికి మెంటల్ ఎక్కుతుంది. ఎన్టీఆర్ ఎలివేషన్స్ తో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం అయినా.. దేవర ఎన్ని సార్లు చూసినా తప్పులేదు. దేవర ఊచకోతకు సగం కారణం అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ. దేవర దెబ్బతో అందరి నోర్లను మూయించేశాడు ఎన్టీఆర్. విమర్శించిన నోర్లె ఇప్పుడు తెగ పొగిడేస్తున్నాయి.

సో మొత్తానికి దేవరతో అటు కొరటాల శివతో పాటు.. ఇటు అనిరుధ్ కూడా నిరూపించుకున్నాడు. రిలీజ్ కు ముందు సినిమాను ఓ రేంజ్ లో ఊహించిన ప్రేక్షకులకు.. అంతకు మించిన అనుభూతిని కలిగిస్తున్నారు. అటు మొదటి రోజు కలెక్షన్స్ విషయంలో కూడా రికార్స్డ్ క్రియేట్ చేసింది. లాంగ్ రన్ లో కుంభస్థలాన్ని బద్దలు కొట్టడం ఖాయం. రిలీజ్ అయ్యి రెండు రోజులు కూడా కాకముందే.. రెండు మూడు సార్లు చూసేస్తున్నారు. ఇక థియేట్రికల్ ఎండ్ లోపు ఎన్ని సార్లు చూస్తారో చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి పార్ట్ కే ప్రేక్షకులు ఈ రేంజ్ లో ఊగిపోతుంటే.. ఇక రెండో పార్ట్ కి పోతారు హైప్ తో మొత్తం పోతారని నిస్సందేహంగా చెప్పొచ్చు. మరి దేవరలో అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments