TS Staff Nurse recruitment 2023తెలంగాణలోని ఆ శాఖలో కొత్తగా 1,890 పోస్టుల భర్తీ.. ఖాళీల వివరాలు ఇవే

తెలంగాణలోని ఆ శాఖలో కొత్తగా 1,890 పోస్టుల భర్తీ.. ఖాళీల వివరాలు ఇవే

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆ శాఖలో మరో 1890 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే వీటి భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆ శాఖలో మరో 1890 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే వీటి భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. ఇటీవల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. వైద్య శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా మరో 1890 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందు అనుమతినిచ్చింది. గత సంవత్సరం డిసెంబర్ 30న 5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

గతంలో ప్రకటించిన 5204 స్టాఫ్ నర్స్ పోస్టులతో పాటు మరో 1890 పోస్టులను కలిపి మొత్తం 7,094 పోస్టులను రాష్ట్ర వైద్యారోగ్య సేవల నియామక మండలి ద్వారా భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. త్వరలోనే ఈ ఉద్యోగాలకు నియామక పరీక్షను చేపట్టి స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం స్టాఫ్ నర్స్ పోస్టులు:

  • 7,094
  • ఆరోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్‌, వైద్యవిద్యాసంచాలక పరిధిలో- 5,650 పోస్టులు
  • వైద్యవిధాన పరిషత్‌ పరిధిలో -757 పోస్టులు
  • ఎంఎన్‌జే ప్రాంతీయ క్యాన్సర్‌ ఆసుపత్రిలో – 81 పోస్టులు
  • దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో – 8 పోస్టులు
  • మైనారిటీ గురుకుల విద్యాలయాల పరిధిలో – 127 పోస్టులు
  • బీసీ గురుకుల సంస్థ పరిధిలో – 260 పోస్టులు
  • గిరిజన గురుకుల సంస్థ పరిధిలో- 74 పోస్టులు
  • ఎస్సీ గురుకుల సంస్థ పరిధిలో -124 పోస్టులు
  • తెలంగాణ గురుకుల సంస్థ పరిధిలో -13 పోస్టులు

జోన్ల వారీగా పోస్టులు:

  • జోన్‌ 1 పరిధిలో- 937 పోస్టులు
  • జోన్‌ 2 పరధిలో – 1044 పోస్టులు
  • జోన్ 3 పరిధిలో -1023 పోస్టులు
  • జోన్ 4 పరిధిలో -719 పోస్టులు
  • జోన్ 5 పరిధిలో – 1305 పోస్టులు
  • జోన్ 6 పరిధిలో -948 పోస్టులు

కేటగిరీల వారీగా పోస్టులు:

  • ఓసీ కేటగిరీ -2110
  • ఈడబ్ల్యూఎస్‌ -653
  • బీసీ(ఎ) -612
  • బీసీ(బి) -686
  • బీసీ(సి)- 81
  • బీసీ(డి)- 466
  • బీసీ(ఈ) -330
  • ఎస్సీ -1041
  • ఎస్టీ -690
  • స్పోర్ట్స్ కోటా- 114
  • దివ్యాంగుల కోటా- 311 పోస్టులు

స్టాఫ్ నర్స్ పోస్టుల ఖాళీల వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Show comments