ఇంటర్ పాసైన వారికి లక్కీ ఛాన్స్.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో Jobs.. 40,000 జీతం

యువత కలల జాబ్స్ అయినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇంటర్ పాసైన వారు వెంటనే అప్లై చేసుకోండి.

యువత కలల జాబ్స్ అయినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇంటర్ పాసైన వారు వెంటనే అప్లై చేసుకోండి.

భారత త్రివిధ దళాలు దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రక్షణ రంగంలో ఉద్యోగం పొందేందుకు యువత కలలుకంటుంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో ఉద్యోగాల కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. రక్షణ రంగాల్లో జాబ్ కొడితే మంచి జీతంతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అంతేకాకుండా లైఫ్ లో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు. మరి మీరు ఇంటర్ పాసైతే ఇదే మంచి సమయం. ఇంటర్ అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ‘అగ్నిపథ్’ స్కీంలో భాగంగా ‘అగ్నివీర్ వాయు’ నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ (02/ 2025) విడుదల చేసింది.

ఇంటర్ అర్హతతో ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయని భావించే వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 8 నుంచి ప్రారంభమై జులై 28 వరకు కొనసాగనున్నది. అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు మొదటి ఏడాది రూ.30,000; రెండో ఏడాది రూ.33,000; మూడో ఏడాది రూ.36,000; నాలుగో ఏడాది రూ.40,000 చెల్లిస్తారు. . అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • ఇండియన్ ఎయిర్ ఫోర్స్- అగ్నిపథ్ స్కీం అగ్నివీర్ వాయు(02/ 2025) బ్యాచ్

అర్హత:

  • కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2)/ ఇంటర్మీడియట్‌(సైన్స్ కాని ఇతర సబ్జెక్టులు) లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)/ తత్సమాన ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 03.07.2004 నుంచి 03.01.2008 మధ్య జన్మించి ఉండాలి.

పరీక్ష ఫీజు:

  • పరీక్ష ఫీజు రూ.550 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

ఎంపిక విధానం:

  • ఫేజ్-1(ఆన్‌లైన్ రాత పరీక్ష), ఫేజ్-2(ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2), ఫేజ్-3(మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు మొదటి సంవత్సరం రూ.30,000; రెండో సంవత్సరం రూ.33,000; మూడో సంవత్సరం రూ.36,000; నాలుగో సంవత్సరం రూ.40,000 చెల్లిస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 08-07-2024

దరఖాస్తు చివరితేదీ:

  • 28-07-2024
Show comments