iDreamPost
android-app
ios-app

భారీ భూకంపం .. సునామి హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం!

భారీ భూకంపం .. సునామి హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం!

భూకంపం.. భయంకరమైన ప్రకృతి వైపరీత్యం ఇది. ఒక్కసారి వస్తే వందలాది ప్రాణాలను తీసుకెళ్లిపోతుంది. సొంత ఇంటిని, తోబుట్టువులను కూడా తీసుకోనిపోతుంది ఈ భూకంపం. ఇలాంటి ఓ సంఘటనే అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలోని అలస్కాలో శనివారం రాత్రి 10:48కి భారీ భూకంపం చోటు చేసుకుంది. భూకంప తీవ్రత రిక్టార్‌ స్కేలుపై 7.4 గా నమోదు అయిందని అమెరికా జియోలాజికల్ సర్వే(USGS) తెలియచేసింది. ఆలేటియాన్ ఐలాండ్స్, కుక్ ఇన్లెట్ ప్రాంతాలలో భూకంపం వచ్చింది అని తెలిపింది.

ఆన్పల్మెర్ నేషనల్ సునామి సెంటర్ ఇప్పుడు దక్షిణ అలస్కా, అలస్కా పెనిన్సులలో సునామి కుడా వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. అక్కడ నివసిస్తున్న జనాలు వేరే ప్రాంతాలకు వెళ్లి ఉండాలని అధికారులు హెచ్చరించారు. పరిస్థితి ఇంకా తీవ్రంగా మారొచ్చని అధికారులు చెబుతున్నారు. అలాస్కాకు సమీపంలో 9.3 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి ప్రజలందరూ భయబ్రాంతులవుతున్నారు.

ఇక, అలాస్కా పసిఫిక్ రింగ్ అఫ్ ఫైర్‌లో ఒక భాగం. రెండు వారాల ముందే అంకోరేజ్ అలస్కాలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. పూర్వం 1964లో అతి తీవ్రమైన భూకంపం ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. అది రికార్డు స్థాయిలో అతి శక్తివంతమైన భూకంపం. ఈ భూకంపం వల్ల సంభవించిన సునామి అలస్కా తో పటు పలు ప్రాంతాలలో విధ్వంసం సృష్టించింది. ఈ సునామీలో 200 కు పైగా మంది చనిపోయారు. మరి, అలాస్కాలో భూకంపంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.