nagidream
How Doctor Praveen Influenced By Nurse And Took His Family Lives Full Story Here: డాక్టర్ కాదు, పెద్ద యాక్టర్. ఆస్కార్ లెవల్ పెర్ఫార్మెన్స్ ఇది. నర్సుతో కలిసి పెద్ద సీనే నడిపించాడు. హత్య చేసి రోడ్ యాక్సిడెంట్ అని పోలీసులని నమ్మించి ఎంత కథ నడిపించాడు సార్ ఈ ప్రవీణ్.
How Doctor Praveen Influenced By Nurse And Took His Family Lives Full Story Here: డాక్టర్ కాదు, పెద్ద యాక్టర్. ఆస్కార్ లెవల్ పెర్ఫార్మెన్స్ ఇది. నర్సుతో కలిసి పెద్ద సీనే నడిపించాడు. హత్య చేసి రోడ్ యాక్సిడెంట్ అని పోలీసులని నమ్మించి ఎంత కథ నడిపించాడు సార్ ఈ ప్రవీణ్.
nagidream
నెలన్నర క్రితం.. ఖమ్మం జిలా రఘునాథపాలెం మండలం మంచుకొండ, హర్యా తండా గ్రామాల మధ్య ఒక ప్రమాదం జరిగింది. డాక్టర్, తన భార్య, పిల్లలతో వెళ్తున్న కారు చెట్టుని ఢీకొట్టింది. కానీ ఆ ప్రమాదం నుంచి డాక్టర్ బయటపడగా.. భార్య, పిల్లలు చనిపోయారు. ఇది డాక్టర్ ప్రవీణ్ చిత్రీకరించిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ. అయితే ప్రతీ సినిమాకి క్లైమాక్స్ ఉన్నట్టే.. క్లైమాక్స్ లో సస్పెన్స్ వీడినట్టే డాక్టర్ ప్రవీణ్ చెప్పిన కథలోనూ ఆ సస్పెన్స్ వీడింది.
ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం మండలం బాబోజీ తండాకు చెందిన ప్రవీణ్ హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఫిజియోథెరఫిస్ట్ గా పని చేసేవాడు. అందమైన భార్య కుమారి (25), కృషిక (5), కృత్తిక (3) ఇద్దరు కూతుర్లతో అందమైన కుటుంబంలో మంచి భర్తగా, మంచి తండ్రిగా ఉండేవాడు. ఎప్పటి వరకూ అంటే నర్సు అతని జీవితంలోకి రానంత వరకూ. కేరళకు చెందిన సోని ఫ్రాన్సిస్ అనే మహిళ.. ప్రవీణ్ పని చేసే హాస్పిటల్ లోనే నర్సుగా పని చేస్తుంది. సోని, ప్రవీణ్ ల మధ్య కెమిస్ట్రీ కుదిరింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో గొడవలు కూడా జరిగాయి. చంపాలన్న ఉద్దేశం డాక్టర్ కి లేదు.. కానీ ఆ ఆలోచనను రగిల్చింది సోనీనే.
భార్య, పిల్లల్ని చంపేయ్. ఇద్దరం ప్రశాంతంగా బతుకుదాం అని ప్రియురాలు సోని పదే పదే చెప్పడంతో ప్రభావితమయ్యాడు. అంతే భార్య, పిల్లల హత్యకు మాస్టర్ ప్లాన్ వేశాడు. డాక్టర్ కాబట్టి ఇతని పని చాలా సులువుగా జరిగిపోయింది. భార్య కుమారికి కాల్షియం లోపం ఉంది. అప్పుడప్పుడూ ఇంజక్షన్ చేయించుకోవడం అలవాటు. ప్రవీణ్ డాక్టర్ కావడంతో ఆ ఇంజక్షన్ తనే చేసేవాడు. అయితే ఇంజక్షన్ చేసేది తనే కాబట్టి మత్తుమందు కలిపి చంపేస్తే సరి అని అనుకున్నాడు. అయితే మత్తుమందు ఇస్తే పోస్టుమార్టం రిపోర్టులో దొరికిపోతాడు కదా. అందుకని అలా దొరక్కుండా ఉండడం కోసం డాక్టర్ కాస్త విలన్ తెలివితేటలు వాడాడు. ఎలాంటి మత్తు మందు, ఎంత మోతాదులో ఇస్తే చనిపోతారో.. దీని గురించి పోస్టుమార్టంలో బయటపడకుండా ఉంటుందో అలాంటి మందు కోసం గూగుల్ లో వెతికి మరీ ఆ మత్తు మందుని కొనుగోలు చేశాడు.
మే నెల 17న భార్య, పిల్లలను ఖమ్మం తీసుకొచ్చాడు ప్రవీణ్. తనతో పాటు ఇంజక్షన్ ని కూడా వెంట తెచ్చుకున్నాడు. ఒకరోజు ప్రవీణ్ భార్య కుమారి ఆరోగ్యం బాలేదంటే.. ఇంజక్షన్ చేస్తా అన్నాడు. కానీ కుమారి వద్దన్నది. దీంతో ప్రవీణ్ వేసిన మొదటి స్పాట్ మిస్ అయ్యింది.
మరలా అదే నెలలో 28న అవకాశం వచ్చింది ప్రవీణ్ కి. ఆధార్ అప్డేట్ చేయించుకుందామని చెప్పి భార్య, పిల్లలను కారులో ఖమ్మం తీసుకెళ్లాడు. అయితే కారులో హైదరాబాద్ కి తిరిగి వస్తుండగా భార్య ఆరోగ్యం బాలేదని.. కాల్షియం ఇంజక్షన్ చేయమని అడగడంతో ప్రవీణ్ కి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఇంజక్షన్ లో మత్తు మందు కలిపాడు. ఆ సమయంలో కుమారికి అనుమానం వచ్చి ఏంటది అని అడిగింది. దానికా డాక్టర్.. రియాక్షన్ ఇవ్వదు, తీసుకుంటే మంచిది అని చెప్పడంతో ఆమె అంగీకరించింది. ప్రవీణ్ ఇంజక్షన్ చేసి కాసేపటికే కుమారి చనిపోయింది. ఆ తర్వాత పిల్లలను ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
కారులో మూడు మృతదేహాలు ఉన్నాయి. ఆ మృతదేహాలతో కారుని ఒక చెట్టుకి ఢీకొట్టాడు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. కారులో వెళ్తుండగా మంచుకొండ-హర్యా తండా గ్రామాల మధ్యలో కారు అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలు అయ్యాయని.. దురదృష్టవశాత్తు భార్య, పిల్లలు చనిపోయారని ప్రవీణ్ పోలీసులకు వెల్లడించాడు. పోలీసులు కూడా దీన్ని యాక్సిడెంట్ కేసుగానే నమోదు చేశారు.
కానీ కుమారి తల్లిదండ్రులకు ప్రవీణ్ మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే నర్సుతో సంబంధం పెట్టుకోవడం, ఇంట్లో గొడవలు అవుతుండడం.. సడన్ గా భార్య, పిల్లలు యాక్సిడెంట్ లో పోవడం ఇవన్నీ చూస్తుంటే అనుమానంగా ఉంది.. అంటూ కుమారి తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించారు. దీంతో పోలీసులు యాక్సిడెంట్ కేసుని కాస్త హత్య కేసుగా నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. భార్య, పిల్లల ఒంటి మీద కూడా గాయాలు లేకపోవడంతో దర్యాప్తు ప్రారంభించారు. కారులో దొరికిన ఖాళీ సిరంజ్ ని పరీక్ష కోసం ల్యాబ్ కి పంపించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ ఇంజక్షన్ లో మత్తు మందు కలిపినట్లు తేలింది. కుమారి మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి తీసుకెళ్లి టెస్టులు చేయగా మత్తు మందు ఇచ్చినట్లు తేలింది.
ప్రవీణ్ ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అవును నేనే చంపాను.. నర్సు మోజులో పడి భార్య, పిల్లలను నేనే చంపాను అని అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రవీణ్ ని అరెస్ట్ చేశారు. ఇంత జరిగిన తర్వాత ప్రవీణ్ తో పడక సుఖాన్ని పంచుకున్న నర్సు అతను చేసిన పాపాన్ని ఎందుకు పంచుకుంటుంది..? అందుకే పరారీలో ఉంది. ఇలాంటి అమ్మాయి కోసమా భార్య, పిల్లలను చంపింది? ఇప్పుడు చేసిన పాపానికి సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక ఈ కేసులో ఏ-2గా ఉన్న సోని ప్రావిన్స్ ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 45 రోజుల పాటు కుమారి తల్లిదండ్రులు, బంధువులు.. పోలీసులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, సీపీలను కలిసి ఈ కేసుపై పోరాటం చేశారు. మొదటి నుంచి ఇది హత్య అని నమ్మిన తల్లిదండ్రులకు ప్రవీణ్ అరెస్టుతో న్యాయం జరిగినట్టయ్యింది.
=========== అలా డాక్టర్ కాస్త యాక్టర్ అయ్యాడు. ఇప్పుడు ప్రిజనర్ అయ్యాడు. ప్రియురాలి ప్రలోభంతో నమ్మిన వాళ్లనే, తనను నమ్ముకుని బతికే వాళ్లనే హతమార్చాడు. ===========