P Krishna
Gold and Silver Rates: గత కొన్నిరోజులుగా పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. దీంతో వినియోగదారులు బంగారం ఎప్పుడు కొనాలో అన్న కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. ధరలు తగ్గినపుడు పసిడి కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Gold and Silver Rates: గత కొన్నిరోజులుగా పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. దీంతో వినియోగదారులు బంగారం ఎప్పుడు కొనాలో అన్న కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. ధరలు తగ్గినపుడు పసిడి కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
P Krishna
ఇటీవల బంగారం, వెండి ధరలు తరుచూ మారుతూ వస్తున్నాయి. ఒక్కోసారి ధరలు వరుసగా పెరుగుతున్నాయి.. అంతలోనే తగ్గిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల్లో జరుగుతున్న యుద్దాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత రెండు నెలలుగా ఎలాంటి శుభకార్యాలు లేకపోవడంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. కానీ పసిడికి మాత్రం ఎక్కడా డిమాండ్ తగ్గలేదు.అయితే బంగారం, వెండి ధరల్లో మార్పుల కారణంగా కొనుగోలుదారులు కొనాలా వద్దా? అన్న అయోమయంలో పడుతున్నారు. ఈ రోజు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే.
బంగారం కొనేవారికి బంపర్ ఆఫర్.. ఎందుకంటే దాదాపు పది రోజుల తర్వాత పసిడి ధరలు దిగివచ్చాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ పోతున్న పసిడి ధరలు నేడు (జులై 9) దిగి రావడంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు వినియోగదారులు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం రేటు పెరిగినా దేశీ మార్కెట్ లో దాని ప్రభావం ఏమీ లేకపోవడం గమనార్హం. ఈ నెల ఆషాఢమాసం మొదలైంది.. పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు జోరందుకోనున్నాయి. దీంతో మళ్లీ పసిడి కొనుగోలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో పసిడి, వెండి ధరలు తగ్గినపుడు కొంటే బెటర్ అంటున్నారు నిపుణులు.22 క్యారెట్ల 10 గ్రాములపై రూ. 10 తగ్గి, 67,440కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ. 10 తగ్గి, రూ. 73,570కి చేరింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 67,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 73,570 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.67,590 ఉండగా. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 73,720 లకు చేరింది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరులో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.67,440 ఉండగా. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.73,570 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.67,990 లకు చేరింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.74,170 లకు చేరింది. కిలో వెండి పై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.99,600 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, కోల్‌కత్తాలో కిలో వెండి రూ.95,100 ఉండగా, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.93,900వద్ద కొనసాగుతుంది. చెన్నైలొ కిలో వెండి ధర రూ.99,600 వద్ద ట్రెండ్ అవుతుంది.