Krishna Kowshik
ఇటీవల ప్రారంభమైన రియాలిటీ షో బిగ్ బాస్. సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. తొలి ఎలిమినేషన్ లో బెజవాడ బేబక్క బయటకు వచ్చింది. కాగా, చాలా మందికి ఆమె యూట్యూబర్ అని మాత్రమే తెలుసు. కానీ ఆమె యాక్టర్, స్టాండప్ కమెడియన్, పాప్ సింగర్ కూడా. ఆమె పాప్ సాంగ్స్ చూశారా..? ఫ్యూజులు
ఇటీవల ప్రారంభమైన రియాలిటీ షో బిగ్ బాస్. సీజన్ 8లో 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. తొలి ఎలిమినేషన్ లో బెజవాడ బేబక్క బయటకు వచ్చింది. కాగా, చాలా మందికి ఆమె యూట్యూబర్ అని మాత్రమే తెలుసు. కానీ ఆమె యాక్టర్, స్టాండప్ కమెడియన్, పాప్ సింగర్ కూడా. ఆమె పాప్ సాంగ్స్ చూశారా..? ఫ్యూజులు
Krishna Kowshik
స్మాల్ స్క్రీన్‌పై ఎంటర్ టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షోలో 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. కమిటైతే లిమిటే లేదు అంటూ తీసుకు వచ్చిన ఈ గేమ్ షోలో ఫస్ట్ ఎలిమినేషన్ కంప్లీట్ అయ్యింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్, సింగర్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. ఆటను అర్థం చేసుకునే లోపే ఇంట్లో నుండి బయటకు వచ్చేశానని చెప్పింది బేబక్క. ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ స్వింగ్‌లో ఉంది ఆమె. ఇదే సమయంలో ఆమె పాప్ సాంగ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో బేబక్కను చూస్తే కెవ్వు కేక అనకుండా ఉండలేం. ఏంటీ మన బేబక్కేనా అనిపించకమానదు.
బెజవాడ బేబక్క పూర్తి పేరు మధు అలియాస్ మాధవి నెక్కంటి. తన వీడియోలతో కామెడీ చేసే ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆమె పాప్ సింగర్ కూడా. ‘హోలలే హోలలే నా మనసే నీదిలే.. కనుల కలలే ఓ గజలే పాడలే’ అంటూ సాగిపోయే సాంగ్‌లో అదరగొట్టింది బేబక్క. ర్యాప్ సాంగ్‌తో అల్లాడించింది. ఇదే ఆమె డెబ్యూ సాంగ్. ‘యో బేబీ టేకి టీజీ’ అనే మరో సాంగ్‌లో కనిపించింది. ఈ సాంగ్స్ ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అమెరికాలో ఉండగా ఈ సాంగ్స్ చేసింది. మధు మల్టీటాలెంటర్. బెజవాడలో పుట్టి పెరిగిన ఆమె.. చిన్నప్పుడు కర్ణాటిక్, హిందూస్థాని సంగీతాన్ని నేర్చుకుంది. ఎంబీఎ చదువుకున్న ఆమె..చదువులు, ఉద్యోగం రీత్యా అమెరికాలో స్థిరపడింది. అక్కడ ఐటి ఉద్యోగం చేస్తూ అక్కడ నిర్వహించే పలు షోల్లో యాంకర్, సింగర్, స్టాండప్ కమెడియన్‌గా రాణించింది.
అయితే కరోనా సమయంలో ఇండియా వచ్చి బెజవాడ బేబక్క పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి.. మంచు లక్ష్మీ ప్రసన్నను ఇమిటేట్ చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. అలాగే జనరల్ విషయాలపై కూడా తన కామెడీ చేసి ఒక్కసారిగా లైమ్ టైల్లోకి వచ్చింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆమె నటి కూడా. 20కి పైగా చిత్రాల్లో నటించింది. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి, 24 కిసెస్, మళ్లీ పెళ్లి చిత్రాల్లో మెరిసింది. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన షూట్-అవుట్ ఎట్ అలేర్ వెబ్ సిరీస్‌లోనూ హీరో భార్యగా నటించింది. ఆమెకు ఇండస్ట్రీతో మంచి సంబంధాలున్నాయి.. దర్శక కేంద్రుడు రాఘవేంద్ర రావు తనకు పెద్ద నాన్న వరుస అవుతారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది బేబక్క. అంతేనా సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. బేబక్క ఫౌండేషన్ పేరుతో గతంలో పాఠశాలలకు టీవీల పంపిణీ కూడా చేసింది. మొత్తానికి ఈ మల్టీ టాలెంటర్, పాప్ సింగర్ సరైన గుర్తింపు లేక మరుగున పడిపోయింది. ఇలా బేబక్కగా మనకు సుపరిచితమై.. నెటిజన్లు హృదయాలను దోచేసింది.