రన్నరప్ గా అమర్ దీప్ ఎన్ని లక్షలు సంపాదించాడంటే

Amardeep Remuneration in Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచాడు అమర్ దీప్. విన్నర్ కావాల్సిన వాడు.. కొద్ది తేడాతో రన్నరప్ గా నిలిచాడు. మరి 15 వారాలకు గాను అమర్ దీప్ ఎంత పారితోషికం అందుకున్నాడంటే..

Amardeep Remuneration in Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచాడు అమర్ దీప్. విన్నర్ కావాల్సిన వాడు.. కొద్ది తేడాతో రన్నరప్ గా నిలిచాడు. మరి 15 వారాలకు గాను అమర్ దీప్ ఎంత పారితోషికం అందుకున్నాడంటే..

ఉల్టాపుల్టా అంటూ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు వంద రోజులకు పైగా కొనసాగి.. ఆదివారం నాడు ముగిసింది. దేశంలోనే తొలిసారి ఓ కామన్ మ్యాన్ అందునా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచాడు. ఇక సీజన్ ప్రారంభం నుంచి అమర్ దీప్ టైటిల్ విన్నర్ రేసులో ఉంటాడని భావించారు. అనుకున్నట్లుగానే.. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. అయితే లాస్ట్ వీక్ లో.. పల్లవి ప్రశాంత్ మీద అనవసర వ్యాఖ్యలు చేసి.. తన ప్రవర్తనతో విన్నర్ గా మిగలాల్సిన అమర్ దీప్ రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

అనంతపురం జిల్లాకు చెందిన అమర్ దీప్ బీటెక్ పూర్తి చేసినా.. సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. అనేక ఇబ్బందుల తర్వాత.. సీరియల్స్ లో అవకాశాలు అందిపుచ్చుకుని.. కెరీర్లో నిలదొక్కుకున్నాడు. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7లో అవకాశం అందిపుచ్చుకున్నాడు. షో ప్రారంభంలో తడబడ్డా తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాడు. అయితే కొన్ని సార్లు తన మాటలతో పాటు ఆటల్లో తెలిసీ తెలియక చేసిన తప్పుల వల్ల నలుగురిలో నవ్వులపాలయ్యాడు. అంతేకాక శత్రువులు ఎక్కడో ఉండరు.. మన పక్కనే ఉంటారు అనేది అమర్ విషయంలో నిజం అయ్యింది.

అవమానాలను సైతం చిరునవ్వుతో భరించి..

హౌజ్ లో కొన్నిసార్లు స్నేహితులు సైతం అమర్ దీప్ ను కూడా పట్టించుకోలేదు. గురువుగా భావించిన శివాజీ సైతం.. అమర్‌ను అనరాని మాటలన్నాడు.. మెంటల్‌ టార్చర్‌ పెట్టాడు. ఎన్నో సార్లు అవమానించాడు. అయినా సరే.. అమర్ అన్నింటినీ చిరునవ్వుతో భరించాడు. వీటికి తోడు అనారోగ్యంతో బాధపడుతున్నా ఏనాడూ బయటకు చెప్పుకోలేదు. హెల్త్‌ ప్రాబ్లమ్‌ వల్ల టాస్కుల్లో సరిగా ఆడలేకపోయినా అది తన వైఫల్యంగానే భావించాడే కానీ అనారోగ్యాన్ని సాకుగా చెప్పలేదు. విజయానికి అడుగు దూరంలో ఆగిపోయి.. రన్నరప్‌గా నిలిచాడు అమర్.

వారానికి రూ.2.5 లక్షలు

బిగ్ బాస్ షోలోకి రావడానికి ముందే అమర్.. సీరియల్స్‌ ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కనుక అమర్‌కు భారీగానే డబ్బులు ఆఫర్‌ చేశారు. వారానికి రూ.2.5 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన 15 వారాలకుగానూ అమర్ ఏకంగా రూ.37,50,000 అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ట్యాక్స్‌లు, జీఎస్టీల రూపంలో దాదాపు సగం కట్ అవుతుంది అంటున్నారు. అయితే రన్నరప్ గా నిలిచినందుకు గాను అమర్ దీప్ కు ఏం లభించలేదు.. ఒట్టి చేతులతోనే స్టేజ్ వీడాల్సి వచ్చింది. విన్నర్ కాకపోయినా.. ప్రజల మనసులు గెలుచుకున్నాడు అమర్.

2017లో ఉయ్యాల జంపాలా సీరియల్ తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2019లో వచ్చిన సిరి సిరి మువ్వలు సీరియల్ అమర్ కు మంచి గుర్తింపు నిచ్చింది. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ముందు అమర్ నటించిన జానకి కలగనలేదు సీరియల్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. బీబీ జోడీలో కూడా పార్టిసిపేట్ చేశాడు. వీటితో పాటు  శైలజా రెడ్డి అల్లుడు, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాల్లో నటించాడు. సీరియల్ నటి తేజస్విని గౌడని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అమర్. బిగ్ బాస్ ద్వారా ఎందరో అభిమానులను సంపాదించుకున్న అమర్ కెరీర్ దూసుకుపోవాలి అంటున్నారు తన అభిమానులు.

Show comments