మరోసారి ప్రజల్లోకి CM జగన్! ప్రజాశీర్వాద యాత్రకి శ్రీకారం?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలబెట్టారు. వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన చాలా పథకాలు దేశానికే స్పూర్తిగా నిలుస్తున్నాయి. ప్రజా రంజకమైన పాలన సాగిస్తూ.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్న వైఎస్‌ జగన్‌ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు.

175 అసెంబ్లీ స్థానాలకు.. 175 స్థానాలు సాధించటమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘ ప్రజాశీర్వాద యాత్ర’కు శ్రీకారం చుడుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఆయన ప్రజల్లోకి వెళ్లనున్నారు. తాను ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తనకు ప్రజల మద్దతును కూడబెడతాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వైపే మొగ్గుచూపుతున్నారని అన్ని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో.. తమ అధినేత ప్రజల్లోకి వెళితే.. మరింత ప్లస్‌ అయ్యే అవకాశం ఉందని వైఎస్సార్‌ సీపీ నేతలు భావిస్తున్నారు.

ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమకు ప్రజల అండ ఉందని, సీఎం జగన్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే ప్రజల్ని తమ వైపు అడుగులు వేసేలా చేస్తాయని భరోసా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కంటే ప్రజాశీర్వాద యాత్రకు మంచి స్పందన వస్తుందని అంటున్నారు. మరి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో చేపట్టనున్న ప్రజాశీర్వాద యాత్రపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments