చంద్రబాబు సభలకు జనం ఎందుకు రావడం లేదు? కారణం ఇదే!

Nara Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రా.. కదలిరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభలకు అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి స్పందన రావడం లేదు. అయితే అందుకు గల కారణం ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Nara Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రా.. కదలిరా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభలకు అనుకున్న స్థాయిలో ప్రజల నుంచి స్పందన రావడం లేదు. అయితే అందుకు గల కారణం ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే హీట్ బాగా పెరిగిపోయింది. చలికాలం పూర్తిగా కాకముందే వేడి దంచికొడుతుంది. అయితే ఇక్కడ చెప్పుకునేది సూర్యుడి నుంచి వచ్చే వేడి గురించి కాదండి.. రాజకీయ ద్వారా పుడుతున్న హీట్ గురించి. మరో రెండు నెలల్లలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పొలిటికల్ హీట్ విపరీతంగా పెరిగింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య పరస్పర ఆరోపణలు, మాటలతో ఒక కురుక్షేత్ర యుద్ధంలా సాగుతోంది. అయితే ఈ యుద్ధంలో తాను అర్జునుడినని సీఎం జగన్, ప్రజలే తన కృష్ణుడని చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇలా సిద్ధం పేరుతో సీఎం జగన్  ఎన్నికల సమరంలోకి దిగారు.  ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సభలు నిర్వహిస్తున్నారు. కానీ అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. అందుకు గల కారణాల ఇవే అంటూ రాజకీయ విశ్లేషకులు పలు అంశాలను ప్రస్తావించారు.

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రా..కదలిరా పేరుతో సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సభలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఆయన నిర్వహిస్తున్న సభలకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. జనం లేక బాబు సభలు ఖాళీ కుర్చిలతో దర్శనం ఇస్తున్నాయి.  ఇప్పటికే ఆయన నిర్వహించిన ఆళ్లగడ్డ, వెంకటగిరి, అనకాపల్లి, నంద్యాల వంటి తదితర ప్రాంతాల్లో జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇదే విషయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు సైతం స్పష్టం చేశారు. అంతేకాక మంగళవారం జీడీ నెల్లూరులో నిర్వహించిన బాబు సభ కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది. సభ ప్రాంగణం మొత్తం ఖాళీ కుర్చిలు దర్శనం ఇచ్చాయి. అసలు ఇలా ఎందుకు జరిగిందో అర్థంకాక బాబు తలపట్టుకుంటున్నారు.

అంతేకాక స్థానిక నేతలపై బాబు మండిపడుతున్నట్లు సమాచారం. అయితే మొత్తంగా బాబు సభలకు జనం లేకపోవడానికి గల కారణంపై రాజకీయ విశ్లేషకులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఇప్పటి వరకు నియోజవర్గాల్లో అభ్యర్థి ఎవరు అనేది స్పష్టం చేయలేదు. ఒక్కొక్క నియోజవర్గానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున  ఆప్షన్ గా పెడుతున్నారు. ఆయన తన గత స్వభావానే ఈ ఎన్నికల వేళ కూడా చూపిస్తున్నారు. బీఫామ్ ఇచ్చే చివరి క్షణం వరకు కూడా మీకే సీటు అంటూ పలువురికి ఆశ పెట్టడం బాబుకు అలవాటని చాలా మంది అంటుంటారు. అదే విధానాన్ని ప్రస్తుతం కూడా బాబు  కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా అభ్యర్థులను ఫైనల్ చేయలేదు.

దీంతో తమకు సీటు వస్తుందే లేదో తెలియక స్థానిక నేతలు జనాలను సమీకరించడానికి ఆసక్తి చూపిండం లేదని టాక్. అలానే బాబు.. ప్రకటించే పథకాల విషయంలో ప్రజలకు చాలా స్పష్టత ఉంది. ఆయన ఏం చెప్పిన  అవి గాలి మాటలే అనేది ఎక్కువ మంది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. దీంతో సాధారణ ప్రజలు కూడా ఎవరు.. బాబు  సభకు వెళ్లి.. ఆ ప్రసంగం వినడానికి ఆసక్తి చూపిండం లేదు. మొత్తంగా ఇలా స్థానిక నేతలు, ప్రజలు చంద్రబాబు సభలపై  ఆసక్తి చూపించకపోవడంతో అక్కడ ఖాళీ కుర్చిలే దర్శనం ఇస్తున్నాయని పొలిటికల్ ఎనలిస్ట్ లు చెబుతున్నారు. మరి.. చంద్రబాబు సభలు అట్టర్ ప్లాప్ కావడం వెనుక గల ఇతర కారణలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments